అందమైన వెన్నెల గుడిలో వెలసినావా విఘ్నేశా //, తెలుగు భజన పాటలు //, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
అందమైన వెన్నెల గుడిలో వెలసినావా విఘ్నేశా
ఉత్సవాల సమయములో నా వైభవంగా ఉన్నావా
చక్కనైన తండ్రివయ్య ఒక్కసారి రావయ్యా
కరుణించు మా తండ్రి మమ్మేల రావయ్య
ప్రియవదనా భవహరణా శుభ చరణా
నిన్ను నమ్మియున్నాము సేవలెన్నో చేశాము
పదములెన్నో పలికాము కనికరించి రావయ్యా
కాణిపాక గణపతివై కోటి కాంతుల నిలచావు
బావిలోనా దేవుడవై భయములన్నీ బాపావు
విఘ్నరాజువై....మహిమ జూపవా...
కరుణించు మా తండ్రి మమ్మేల రావయ్య
ప్రియవదనా భవహరణా శుభ చరణా
నిండు పున్నమి చంద్రునిలా మిలమిల నువు మెరవాలా
భజన భక్తుల హృదయములో నిండుగా నువు నిలవాలా
కాణిపాక గణపతివై కోటి కాంతుల నిలచావు
బావిలోనా దేవుడవై భయములన్నీ బాపావు
విఘ్నరాజువై....మహిమ జూపవా....
కరుణించు మా తండ్రి మమ్మేల రావయ్య
ప్రియవదనా భవహరణా శుభ చరణా