ప్రముఖ ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు, విత్తన ఉద్యమ నాయకులు తాను మొదట ఆచరించి, మంచి ఫలితాలు సాధించి, తాను అందుకున్న, నేర్చుకున్న విషయాలు అందరికి చేరాలనే అకుంఠిత దీక్షలో అనేక మంది యువ రైతులకు దేశీయ విత్తనాలు ఇచ్చి, వారితో వ్యవసాయం చేయించి వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న శ్రీ విజయ రాం గారు ఇటీవల ఎమరాల్డ్ మిఠాయి దుకాణం దగ్గర జరిగిన ఇంటి పంట కార్యక్రమంలో మాట్లాడిన సమాచారంలో కొంత భాగం, పైన వీడియోలో విజయ రాం గారు దేశీ విత్తనాలు ఇస్తాను అని చెప్పారు, ఆ విత్తనాలు కాశీ టమాటా, చిత్రాడ బీర, పొన్నగంటి కూర విత్తనాలు గురించి కాదు అని గమనించాలి.