ఒకప్పుడు దున్నే వాడిదే భూమి అనే సంప్రదాయం ఉండేది. అది సాగు చేసే భూమి అయినా, స్వాధీనంలో ఉన్నాసరే.. ఎలాంటి దస్తావేజులు అవసరం లేకుండా భూయజమానులుగా గుర్తించే వారు.. కానీ మన దేశ స్వాతంత్ర్య అనంతరం ఎన్నో చట్టాలు అమలులోకి వచ్చాయి. మరి ఆ చట్టాలకు సంభందించి తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైన మార్పు చేర్పులు జరుగుతున్నాయి...? భూమి భద్రతకు ఎలాంటి చట్టాలు అమలు చేయబోతున్నాయి అన్న అంశాలపై ఇంతకు ముందు నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకున్నాం.. ఇక ఇవాల్టి కార్యక్రమంలో భూమికి సంబందించి అతి కీలకమైన దస్తావేజుల గురించి న్యాయనిపుణులు సునీల్ కుమార్ గారు వివరాలు అందిస్తారు.
#LandPurchasePrecautions #SuniKumar #hmtvAgri