తోలు బొమ్మరా గాలి బుడగరా మాయరా దేహం //, తెలుగు భజన పాటలు //, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
మా అన్నయ్య సినిమాలో నీలి నింగిలో నిండు జాబిలి పాట స్టైల్
తోలు బొమ్మరా గాలి బుడగరా
మాయరా దేహం సుడిగాలిలో దీపం
కనుతెరచినంత జననం కనుమూసినంత మరణం
ఓ మానవా కనరా ఈ జీవితం భ్రమరా
నాది నాదని అంటావు వాదనలు చేస్తుంటావు
నీవే గొప్పనుకుంటావు విర్ర వీగుతు వుంటావు
నీతులు ఎన్నో చెబుతావు నీ మాటే నిజమంటావు
నిను నీవెరుగుమురా నీదన్నది శూన్యమురా
పెంచిన ఆస్తులు స్థిరమౌనా కన్న బిడ్డలు తోడౌనా
పంచిన మమతలు మిగిలేనా హితులు నీతో వచ్చేనా
బంధాలన్నీ మాయేరా కలిమి బలిమి భ్రమయేరా
ఎంత బ్రతుకిదిరా చితి మంట బూడిదరా
మోహపు తెరలను వీడుమురా నిజము కనుగొని నడువుమురా
మోసపు పనులిక చేయకురా మనిషి మనిషిగ బ్రతుకుమురా
వదలదు కర్మ ఒకనాడు నిను వెంటాడును ఏనాడు
తుళ్లిపడమాకు ధర్మాన్ని విడబోకు
పరమాత్ముని మది నమ్ముమురా దైవ స్మరణే చేయుమురా
అజ్ఞానమునే వదలుమురా జ్ఞానివై ఇల మసలుమురా
అప్పన్నదాసుని ఈ తత్త్వం చూపును మంచికి ఒక మార్గం
వేదవాక్యమురా నిజమేదొ గనవేరా