ఎర్కలోల్ల పిల్ల చిన్నది | గానం - తిరుపతయ్య మొలచింతలపల్లి | హార్మణి - మేడిపూర్ వెంకటయ్య | తబల - యాదిరెడ్డి ,యాదిరెడ్డి పల్లి = 8008849431
తత్వము - జుల్వతాళం
ఎర్కలోల పిల్ల చిన్నది ఎంతో అందంగున్నది
జరిగింది చెప్పుత నన్నది జరగబోయేది జెప్పుతనన్నది
||ఎర్క||
మాయను దాటి మార్గము తెలిపేద
మనసుంటెనే రంమన్నది
మనసుంటెనే రంమన్నది
తెలిసుంటెనే రమ్మన్నది ||ఎర్క||
నేనందరికీ కనరా నన్నది నన్ను కనుగొంటేనే సూతమన్నది
నన్ను కనుగొంటేనే చూద్దమన్నది
నీవు కారణం పొంది రమ్మన్నది || ఎర్క ||
వచ్చి పోయే వారి వరుస తెలుసుకొని
ఓపికుంటెనే రమ్మన్నది.
ఓపికంటేనే రమ్మన్నది
ఒనరెరిగి కనుగొనమన్నది ||ఎర్క||
వన్నె చిన్నలు లేవు నాకు మన సొప్పితేనే రమ్మన్నది
మన సొప్పితీనే రమ్మన్నది
నీవు కారణం పొంది రమ్మన్నది ||ఎర్క||
మేడ మిద్దెలు లేవు నాకు మే ధావు తలంపుగా యున్నను
మీదీనిలో నన్ను గన్నవారికి మేలుగూర్చేదా నన్నది ||ఎర్క||
చెంచల మిడిసినా చెన్నకేశవుడు
చేతిలో కనిపిస్తానన్నడు ఆత్మశుద్ధి గల వారికెప్పుడూ అనుకూలమై ఉంటానన్నది. ||ఎర్క||
కులమ మతము లేదు నాకు మనము కూడి యుందము రమ్మన్నది కూడి యందము రమ్మన్నది కుడి ఎడుమాలనేనుంట నన్నది. ||ఎర్క||
చింతలన్నీ విడిచి చిన్నదానింటికి
సంతోషముగా రమ్మన్నది సంతోషముగా రమ్మన్నది
నా గారాముగనుగొన్న మన్నది ||ఎర్క||
తంటాలు విడిచి గురుని సూత్రముకు
తాళి గట్టు మనుచున్నది తాళి గట్టు మనుచున్నది నా తమాషా కనుమనుచున్నది ||ఎర్క||
నా కొంగు తట్టినా కోరికలన్నీ కోర్కునేదే నిజమన్నది
కోర్కునెదే నిజ మన్నదీ నా కోరీక నే తీర్చ మన్నది || ఎర్క||
శేష పాన్పు పైకి చేరవస్తానని చేతిలో చేయివేయ మన్నది. చేతిలో చేయి వేయమన్నది నా చెంతకు రమ్మనుచున్నది
||ఎర్క||
నీకొద్ది గుణంబుల శుద్ధి పరిచీనా కొరతదీరా రమ్మన్నది
నా మార్గము తెలిసిన మాన్యులకెల్లా మళ్లీ జన్మ లే దన్నది
||ఎర్క||
దేశీకులకు జీ నాసరి గురువుకు దాసురాల ననుచున్నది
దాసురాలా నన్ను చున్నది ధరి జేరి ముక్తి గనుమన్నది.
||ఎర్క||
ధరను రాయల గండి కొండల్లోనే దాముడ నేనుంటా నన్నది
దాసుడ నేనుంటా నన్నది దశనాధము కనుమనుచున్నది
||ఎర్క||
వేద పాఠకుల యడ్లరామాదాసు ఏ విధముగ గనుకొన్నడో
ఏ విధముగా కనుక్కున్నాడో వార్నీఎప్పుడు మరువరాదన్నది
|| ఎర్క లోలపిల్ల చిన్నది||
Hashtags:
#మేడిపూర్వెంకటయ్యభజనలుతత్వాలు
#ఎర్కలోలపిల్లచిన్నది #తెలుగుతత్వం #ప్రకృతి #తెలుగుకవిత #సహజసౌందర్యం #తెలుగు #తత్వచింతన