రచన : సత్యవతి
ఎన్నిసార్లు గుచ్చిగుచ్చి అడిగినా అదే సమాధానం! చావుతెలివి అంటే ఇదేనేమో!
“ఎందుకట్లా చెప్తావు? ఉన్న సంగతి చెప్పు. నువ్వెట్లాగు చనిపోతున్నావు. ఇంకెందుకు భయం. ఉన్న సంగతి చెప్పెయ్. ఫరవాలేదు. ధైర్యం తెచ్చుకో.”
మళ్ళీ అదే సమాధానం. ఎక్కడో నూతిలోంచి
“చచ్చేదాన్ని ఎందుకమ్మా అట్లా వేధిస్తారు! ఇప్పుడైనా శాంతిగా ఉండనివ్వరా! శాంతిగా చావనివ్వరా!” ఒక పెద్దావిడ.
మా! తుఝ సలాం. చాలా బాగా చెప్పావు. బ్రతుకులో చావులో శాంతి పరిరక్షణే కదా మన ధ్యేయం!