#vikramarka #rajavikramarka #battivikramarka
విక్రమార్కుడు వాళ్ళందర్ని గమనించి నవ్వుకుంటూ గరుడ స్తంభం మీద నిలుచుని “ఓ రత్నవల్లి! ఆ నాడు నన్ను చంపితింటానని గొప్పగా శపధం చేసావుగా! ఇప్పుడు చెప్పు నీవు చేసిన శపధం నెగ్గిందా లేక నేను నిన్ను అవమానించడం జరిగిందా? ఏం నీకు గుర్తులేదా అదే ఆ రోజు….” అంటూ విక్రమార్కుడు మొత్తం మణివేగుని అంగడి వద్ద జరిగిన దాని దగ్గరనుండి తను దేవుడి విగ్రహం వెనుక నుండి మాట్లాడడం నుండి అప్పటి వరకూ జరిగిన అన్నీ చెపుతూ రత్నవల్లిని ఎగతాళి చేశాడు.
అంతా కూడా రత్నవల్లిని చూసి ఒకటే నవ్వారు. ఆ అవమానం భరించలేక రత్నవల్లి ఎవరికీ కనబడకుండా ఎక్కడకో వెళ్ళిపోయింది. రాజులంతా కూడా తమతమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. భట్టి మాత్రం విక్రమార్కుడికే ఇంతటి తెలివి తేటలుంటాయి ఖచ్చితంగా ఆ చిలుకలో ఉంది విక్రమార్కుడే అని గ్రహించి, ఆయన దగ్గరకు వెళ్ళి “అన్నగారూ! మీరు ఉజ్జయినిని మరిచి ఇలాంటి చిద్విలాసాలతో కాలం వృధా చేయడం మంచి పద్దతేనా!” అంటూ చిరుకోపం చూపించి విక్రమార్కుడిని తనతో పాటూ తీసుకువెళ్ళిపోయాడు.
విక్రమార్కుడు జరిగిన విశేషాలన్నీ చెప్పాడు. భట్టి మంగలివాడు చేసిందంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి మంగలివాడికి శాస్తి చేయడానికి ఒక చక్కని పధకం పన్నారు.
ఆ పధకం ప్రకారం రాణుల దగ్గరనుండి ఒక కబురు పంపించమని చెప్పారు. ఆ కబురు ఇలా ఉంది “మా దేవీ పూజ సమాప్తమైంది. మీరు రావచ్చు కానీ పొట్టేలు పందాలలో మీరు గెలవాల్సి ఉంటుంది.”
మంగలివాడు `సరే’ అని ఉత్సాహంగా పొట్టేలు పందాలు జరిగే చోటుకు వెళ్ళాడు. అక్కడ రెండు పొట్టేళ్ళున్నాయి “ఒకటి రాణుల పొట్టేలు, ఇంకోటి మీ పొట్టేలు. మీ పొట్టేలు గెలిస్తే మాత్రమే మీరు రాణుల అంతఃపురంలోకి ప్రవేశించ గలిగేది” అని భట్టి షరతు గురించి చెప్పాడు
you can also Join this channel membership to get access of my workspace overview and interraction regarding the channel videos :
https://www.youtube.com/channel/UCYLterYuMYZmKAF5TrgJYbQ/join
Namasthe...!
Welcome to Telugu YouTube Channel
Here You can Find More Interesting Videos in Telugu
About Aliens Devils Ghosts Hidden Secrets not only This you can find Histories Mysterious Ancient Technology in India or in this World and also you can find Top Countdown videos like Top10 Top20 Top30 in Telugu I will give you Entertainment with knowledge in Telugu unknown facts in Telugu Amazing facts in Telugu Interesting facts
► Subscribe Our Channel for Amazing and Interesting facts videos in Telugu