పూజకు కావలసిన వస్తువులు? ఆంజనేయ స్వామి చిత్రపటం పసుపు కుంకుమ పూలు అక్షతలు దీపాలు అగరొత్తులు నైవేద్యము మరియు కర్పూరము.
ఈ పూజ మహిళలు చేయవచ్చా?
స్త్రీలు పురుషులు ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు కానీ ఆటంకం వచ్చిన రోజులు విడిచి పెట్టి మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు.
41 రోజులు చేస్తే పొద్దున్నే సాయంకాలం రెండు పూటలా పూజ చేయాలా? అవును రెండు పూటలా ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది వీలు లేకపోతే ఒక్కసారైనా పూజించండి
పూజలో కలశం తప్పనిసరిగా పెట్టాలా? మీ సంప్రదాయంలో ఉంటే తప్పకుండా కళశం పెట్టుకోండి లేదంటే అవసరం లేదు.
ఏటి సూతకం ఉన్నవాళ్లు చేయవచ్చా?
చేయకూడదు.
పూజ చేసే రోజుల్లో మాంసాహారం భుజించకూడదు
హనుమాన్ జయంతి రోజు పూజ చేస్తే బ్రహ్మచర్యం పాటించాలి
41 రోజులు దీక్ష చేసేటప్పుడు బ్రహ్మచర్యం అవసరం లేదు
ఆడవాళ్ళు అయితే మామూలు స్నానం చేస్తే చాలు అంటే తలస్నానం చేయవలసిన అవసరం లేదు కానీ వ్రతాల్లో పర్వదినాల్లో దాంపత్యం చేసినప్పుడు మాంసాహారం భుజించినప్పుడు తప్పక తల స్నానం చేయాలి.
మగవాళ్ళు అయితే ప్రతినిత్యము తలస్నానం చేయాలి.
Pooja vidanam PDF
https://docs.google.com/document/d/1XYJHTDX7Dm2W6N7GL9HgrDy_1OAYR96Reg0vIUGCSto/edit?usp=drivesdk