కాశీ రామేశ్వరం యాత్ర విశిష్టత గురించి ప్రతి హిందువు తెలుసుకోవాలి _ Kashi Rameshwaram Yatra chaganti
ముందు కాశీ వెళ్ళి అక్కడ గంగాజలంతో విశ్వేశ్వరుని అభిషఏకము చేయాలి. ఆ తర్వాత కాశీలోని గంగాజలంతో రామేశ్వరం లోని ఈశ్వరునికి అభిషఏకము చేయాలి. ఆ తర్వాత రామేశ్వరం లోని ఇసుక తీసుకొని తిరిగి కాశీ వెళ్ళి శివునికి అభిషకం చేయాలి. ఇలా చేస్తే దీనిని సంపూర్ణ తీర్ధయాత్ర అంటారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరం అయిన కాశిని గురించిన రహస్యాలను సద్గురు వివరిస్తున్నారు. అక్కడ నివసించడానికి ఎంచుకున్న వేలాది మంది ప్రజలను ఒక ఆధ్యాత్మిక మార్గానికి తీసుకువెళ్లే ఒక ద్వారంగా పనిచేసేలా, ఈ నగరం మొత్తాన్నీ ఒక యంత్రంలా ఎలా ప్రతిష్టించారో ఆయన వివరిస్తున్నారు.
కాశీ యాత్ర మహాపుణ్యం అని చెబుతారు. కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళి, తిరిగి కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే అది ' సంపూర్ణ కాశీ యాత్ర ' అవుతుంది. ఈ యాత్రకు సంబంధించి విధి విధానాలు ఉన్నాయి.
యాత్రా విధానం
మొదట వారణాశి వెళ్ళాలి. అక్కడ గంగలో స్నానం చేసి, అమ్మవారిని, స్వామిని దర్శించాలి. అక్కడ 9 రోజులు నిద్రలు చేయాలి. గంగా నది జలం, మట్టిని సేకరించాలి. అవి తీసుకుని రామేశ్వరం చేరాలి. అక్కడ రామేశ్వర స్వామి వారిని దర్శించాలి. కాశీ నుంచి తెచ్చిన గంగా జలాన్ని స్వామి వారికి అభిషేకించాలి. కాశీ మట్టిని రామేశ్వరం సముద్రంలో కలపాలి. సముద్ర స్నానం ఆచరించాలి. రామేశ్వర స్వామి ఆలయంలో వుండే 21 బావుల వద్ద దంపతులు స్నానాలు చేయాలి. ఇలా చేయడం వల్ల బహిష్టు సమయంలో స్త్రీలు చేసిన అపచారాలు తొలగి పోతాయని నమ్మిక.
రామేశ్వరం సముద్రంలో ఇసుక, మట్టి సేకరించి తిరిగి వారణాశి చేరాలి. అక్కడ గంగానదిలో స్నానం చేసి, ఇసుకను, మట్టిని గంగలో కలపాలి. అప్పటికి సంపూర్ణ యాత్ర పూర్తి అవుతుంది.
ఇంటికి వచ్చాక, స౦తర్పణ చేయాలి. ఇందులోభాగంగా కాలభైరవ పూజ, గంగపూజ చేయాలి. గారెలు వండి, దండగా గుచ్చి, కాలభైరవుని ( కుక్క ) మెడలో అలంకరించాలి.
సంపూర్ణ యాత్ర చేసిన వారికి కుటుంబ సభ్యులు ఎదురేగి, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. బిడ్డలుగానీ, చిన్నవారు గానీ కాళ్ళు కడిగి, పాదపూజ చేయాలి.
ఇలా ఎదురేగి, స్వాగతం చెప్పడం సంప్రదాయం ఒక కారణం. పూర్వం అడవులు దాటుకుని, ప్రయాస పడి కాశీ యాత్ర చేసేవారు. అలా వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని నమ్మకం వుండేది కాదు. అందుకే
' కాశీకి పోయిన వాడూ, కాటికి పోయిన వాడూ ఒకటే! '
అనే సామెత పుట్టింది.