MENU

Fun & Interesting

తమ్మలబంధ గ్రామంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు బట్టలు పంపిణీ --- దుమంతి.సత్యనారాయణ.

Dumanthi Satyanarayana 306 2 months ago
Video Not Working? Fix It Now

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం మరియు మంప పంచాయతీ పరిధిలో గల తుమ్ములబంధ గ్రామంలో తల్లిదండ్రులు లేని ముగ్గురు పిల్లలకు మరియు వారి నానమ్మ కు సంక్రాంతి పండుగ సందర్భంగా వారికి బట్టలు మరియు కొంత ఆర్ధిక సహాయం నేను (దుమంతి.సత్యనారాయణ) తేదీ.15.01.2025 , కనుమ రోజున పంపిణీ చేసాను. వివరాలలోకి వెళితే శ్రీమతి సేగ్గె. రత్నం అనారోగ్యం తో ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది మరియు భర్త మల్లేష్ కూడా అనారోగ్యం తో రెండు నెలల క్రితం మరణించాడు. మరణించిన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు:- 1. సెగ్గే. శివ గంగ -10 th.Class 2. దేవీ దుర్గా -7th.Class 3. విష్ణు -4th.Class చదువు తున్నారు. వీరి బాగోగులు నాన్నమ్మ అక్కమ్మ తన వృద్ధాప్య పింఛను తో చూస్తుందని తెలిసినది. వీరికి బట్టలు మరియు రూ.2000/- లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ - ఇంగువ. రామన్న పదాల్, దుమంతి. రామకృష్ణ, అశోక్ లాల్, మొయిరి. రమేష్ మరియు గ్రామస్తులు మంట. వీరబాబు, లవరాజు మొదలగు వారు పాల్గొన్నారు.

Comment