MENU

Fun & Interesting

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వంతరఫునపట్టువస్త్రాలు సమర్పించినమంత్రిలోకేష్

KHADRI CABLE NEWS 2,981 1 day ago
Video Not Working? Fix It Now

*కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్* *బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణమహోత్సవం* *స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి* *బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు* కదిరిః శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇలపై వెలసిన మహా విష్ణువు ప్రతిరూపం కదిరి శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీన అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన స్వామివారి కల్యాణమహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వేదపండితులు వసంత వల్లభుడికి మంత్రి నారా లోకేష్ తో సంకల్పం చేయించారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అంతకుముందు శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని పార్టీశ్రేణులు పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి,ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. *మంత్రి లోకేష్ కు అడుగడుగునా జన నీరాజనం* సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కదిరి వస్తుండగా పార్టీ శ్రేణులు, ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ప్రతి గ్రామానా ఘనస్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. దారిపొడవునా బాణసంచా కాల్చుతూ తమ అభిమానం చాటుకున్నారు. కాన్వాయ్ ను ఆపి ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. *****

Comment