నోరూరించే పనీర్ మంచూరియన్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు | Paneer Manchurian @HomeCookingTelugu
పనీర్ మంచూరియన్ రెస్టారెంట్స్లో ఎంతో బాగుంటుంది కదా. ఈ రెసిపీని అదే రుచి వచ్చేట్టు ఇంట్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం.
#paneermanchurian #manchurian #starter
Here's the link to this recipe in English: https://bit.ly/3uEiA5L
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 5-6
పనీర్ వేయించడానికి కావలసిన పదార్థాలు:
పనీర్ - 400 గ్రాములు
మైదాపిండి - 2 టీస్పూన్లు
కార్న్ ఫ్లోర్ - 4 టీస్పూన్లు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
మిరియాల పొడి
కారం - 1 టీస్పూన్
నీళ్ళు
నూనె
సాస్ చేయడానికి కావలసిన పదార్థాలు:
నూనె - 3 టీస్పూన్లు
తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్స్పూన్
తరిగిన అల్లం - 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
కారం - 2 టీస్పూన్లు
మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
టొమాటో కెచప్ - 1 / 2 కప్పు
సోయా సాస్ - 2 టీస్పూన్లు
నీళ్ళు
కార్న్ ఫ్లోర్ మిశ్రమం (1 టీస్పూన్ కార్న్ ఫ్లోర్ + నీళ్ళు)
వేయించిన పనీర్
తరిగిన ఉల్లికాడ గడ్డలు
తరిగిన ఉల్లికాడలు
తయారుచేసే విధానం:
ముందుగా పనీర్ను పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఉంచాలి
ఒక బౌల్లో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి అంతా ఒకసారి కలిపిన తరువాత, నీళ్ళు పోసి, పిండి మిశ్రమం తయారుచేయాలి
ఈ మిశ్రమంలో పనీర్ ముక్కలు వేసి, పూర్తిగా కోట్ చేయాలి
ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసిన తరువాత, కోట్ చేసిన పనీర్ ముక్కలు వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించి, పక్కన పెట్టాలి
ఇప్పుడు సాస్ కోసం, ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయలు వేసి వేయించాలి
ఇందులో కారం, మిరియాల పొడి వేసి ఒకసారి కలిపిన తరువాత టొమాటో కెచప్, సొయా సాస్ వేసి కలపాలి
ఇందులో కొన్ని నీళ్ళు పోసి ఒక నిమిషం పాటు వేయించిన తరువాత, కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి, అంతా కలిపి, ఇంకొక నిమిషం పాటు వేయించాలి
సాస్ పూర్తిగా తయారైన తరువాత, వేయించిన పనీర్ ముక్కలు వేసి, సాస్ మొత్తం పట్టేట్టు కలపాలి
చివరగా ఇందులో తరిగిన ఉల్లికాడగడ్డలు, తరిగిన ఉల్లికాడలు వేసి కలపాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే పనీర్ మంచూరియన్ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటాయి
Hey guys,
Indo-Chinese recipes are always fun because of their distinct taste. I know most people try something different when there are any occasions or small get togethers with friends and family. So today, I am going to show you all one such interesting recipe. It's Paneer Manchurian. Paneer is loved both by vegetarians and non vegetarians and this particular Manchurian doesn't fail to impress anyone who has a bite of it. So make or bring some fresh paneer and try this recipe. You can have it for evening snacks or as a starter for your lunch or dinner. Do try this and enjoy!
Our Other Recipes:
Aloo manchurian: https://bit.ly/3H6NNFX
Baby Corn Manchurian: https://bit.ly/3OYussu
Cabbage Manchurian: https://bit.ly/3F1OFcc
Oats Manchurian: https://bit.ly/3VRmpQx
Gobi Manchurian: https://bit.ly/3VHJeWw
Vegetable Manchurian: https://bit.ly/3FmjsSl
Bread Manchurian: https://bit.ly/3B36cQk
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com