తమ్ముడా ఓ లక్ష్మణా నీ వదిన సీతా ఏదిరా// తెలుగు భజన పాటలు//, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
తమ్ముడా ఓ లక్ష్మణా నీ వదిన సీతా ఏదిరా
ఆ తరుణి సీతా ఏదిరా మన పర్ణశాలలో లేదురా
తమ్ముడా నిను పదిలమూగా పర్ణశాలలో ఉంచితి
సీతనొక్క దాన్ని విడచి ఎటుల వస్తివి తమ్ముడా
మాయ రాక్షసి అరుపులకు మా వదిన సీతా పంపెను
గిరులు గీసి ఆజ్ఞ నిలిపి పరుగునా నేనొస్తిని
ఆడువారి మాటలకు నీవేల వస్తివి తమ్ముడా
సీత మాటలు మనకు పెద్ద చేటు తెచ్చెను తమ్ముడా
మోసపోతి తమ్ముడా మారీచ మృగము లక్ష్మణా
మృగము వెంబడి పోయినందుకు అఘము కలిగెను లక్ష్మణా
ఘోర రాక్షసుడొచ్చి నన్ను మోసగించెర లక్ష్మణా
మోసగించెర లక్ష్మణా ఏతెంచి చూడర లక్ష్మణా
తల్లిదండ్రుల కొరకు మనము తపసి వేషము దాల్చియు
పర్ణశాలకు వచ్చినందుకు ఫలితమేమిర తమ్ముడా
సీత కొరకు రాముడెంతో చింతబోవు చుండెను
దుఃఖబోవుచు అన్న దమ్ములు అడవి మార్గము బట్టిరి