ఎక్సప్రెస్ వేగంగా పరుగెడుతూంది.
ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్లో కిటికీ దగ్గర కూచుని చిన్న పిల్లాడిల బయటకు చూస్తున్నాడు చలపతి. అప్పుడే తెల్లవారుతోంది. వెలుతురు చీకటిని చొచ్చుకొంటూ వస్తూంది. దగ్గరగా ఓ చెరువు. దాని చుట్టూ కాకులు వరసగా మౌనంగా నించుని ఉన్నాయి. వాటిని చూస్తూంటే చలపతికి నవ్వు వచ్చింది.