0125...|| ఆకాశంలో అందమైన ||
పల్లవి...
ఆకాశంలో అందమైన ఓ చందమామయ్యా
నీకన్నా భలే అందగాడు మా రామచంద్రుడయ్యా
ఓ...ఓ...రామయ్య ఓ...ఓ...సీతారామయ్య
చరణం1
రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావయ్య
రేయీ పగలు చల్లగా మమ్ము కాచేరామయ్యా
ఓ...రామయ్య ఓ...భద్రాద్రిరామయ్యా
చరణం2
నల్లానల్లని మబ్బులు మాటున నీవున్నావయ్య
భక్తుల గుండెల మాటున దాగిన రామచంద్రుడయ్యా
ఓ...రామయ్య ఓ...సీతారామయ్య
చరణం3
వేల వేల ఆచుక్కల నడుమ నీవున్నావయ్య
లక్షల కోట్ల జీవరాశిలో రామచంద్రుడయ్యా
ఓ...రామయ్య ఆ...సీతారామయ్యా
చరణం4
రోజురోజుకో దిక్కున ఉంటవు చందమామయ్య
హనుమగుండెలో స్థిరముగదాగిన రామచంద్రుడయ్యా
ఓ...రామయ్య ఆ...సీతారామయ్య