#education #educationsystem #jayaprakashnarayana #loksatta
మన పాఠశాల విద్య పునాదులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, కాబట్టి బడి చదువు సరిగా లేకుండా పదవ తరగతి పూర్తిచేసిన పిల్లలు ఆ పునాదుల్ని బలోపేతం చేసుకుంటూ తర్వాతి కెరీర్ ప్రణాళికను రూపొందించుకోవాలని 'టెన్త్, ఇంటర్మీడియెట్ తరవాత పిల్లల కెరీర్.. తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర' పై
21st Century IAS అకాడమీ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో
ప్రజాస్వామ్య పీఠం (FDR ), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్
నారాయణ్ సూచించారు.
ఇవాళ్టి తరం చేయబోయే ఉద్యోగాల్లో డెబ్భై శాతం వరకూ ఇంకా ఉనికిలోకి రాలేదని, ఐఏఎస్ సహా ఏ పోటీ పరీక్షనూ సర్వస్వం అనుకోకుండా నచ్చిన రంగానికి సంబంధించిన కోర్సుల్ని ఎంచుకుని నైపుణ్యాల్ని పెంచుకోవటమే నాణ్యమైనఉపాధికి సరైన మార్గమని.. ర్యాంకులు, మార్కుల చుట్టూ తిరగకుండా
తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, సమాజం కూడా ఈ దిశగా పిల్లలకు
తోడ్పాటునివ్వాలని JP హితవు పలికారు.