బుచ్చిరెడ్డిపాలెం, ఇస్కపాలేం, దుర్గా నగర్ లో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గా అమ్మవారి 12 వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. 108 కలశముల తో వినాయకుని గుడి వద్ద నుండి భక్తులు ఊరేగింపు గా శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి వద్దకు చేరుకొని అమ్మవారికి అభిషేకం చేయడం జరిగినది. తదుపరి కమిటీ ఆద్వర్యం లో ఆమ్మ వారికి విశేష అభిషేకములు, అర్చనలు, మహా చండీ యాగము, విశేష పూజ , పూలంగి సేవ, అన్నదాన కార్యక్రమములు జరిగినవి. భక్తులు అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యం సమర్పించడం జరిగినది.