ఆళ్వార్లు, నాయనార్లు అన్న మాటలు మనం వింటూనే ఉంటాం. ఆళ్వార్లు అంటే విష్ణుభక్తులని, నాయనార్లు అంటే శివభక్తులని సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ ఆళ్వారులు ఎవరు? వారి కథేమిటి అన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఆళ్వారు అన్న మాటకు జ్ఞానసముద్రంలో మునిగి తేలినవాడు అని అర్థం. ఆళ్వారులను దివ్యసూరులు అని కూడా అంటారు. వీరు పరమయోగులు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరివారమే ఇలా పన్నెండుమంది ఆళ్వార్లుగా జన్మించారు. అటువంటి మహాపురుషుల పుణ్యప్రదమైన చరిత్రలను సంక్షిప్తంగా చెప్పుకుంటూ వారిని స్మరించుకోవడానికే ఈ వీడియో.
Rajan PTSK
#alwar #srivaishnavism