సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్న ఇద్దరు టెంత్ క్లాస్ మేట్లు.. ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని ఇండ్ల మధ్యలో ఉన్న ముప్పావు ఎకరంలో 14 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడి సాధిస్తున్నారు. వ్యవసాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా సేంద్రీయ సేద్యం చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. తమ ఫామ్ దగ్గరే చుట్టు పక్కల వారికి ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తున్నారు. ఆనందంతోపాటు ఆదాయాన్ని సైతం పొందుతున్న ఆ ఇద్దరు మిత్రులు.. ఈ వీడియోలో తమ అనుభవాన్ని పంచుకున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi
#RythuBadi #రైతుబడి #Multicrop