మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి...ఆయ్...
డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా.
రాజోలు.
మాగోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి...ఆయ్... అంటున్నారు ఆర్యవైశ్యలు.
50 వ పుట్టినరోజుర వేడుకల్లో అత్తకు కోటి రూపాయల విలువ చేసే అదిరిపోయే బహుమతి లు ఇచ్చిన కోడలు...
సాధారణంగా అత్తా - కోడళ్ళకు పడదు.ఏదో విషయానికి గొడవలు, అభిప్రాయ భేదాలు సహజమే. మేనరికం చేసుకున్నా తప్పదు. కానీ వేలల్లో ఒకరు మాత్రమే బాగుంటారు.అదీ కూడా చాలా అరుదుగా ఉండొచ్చు...అత్తలు కోడళ్ళుకు, కోడళ్ళు అత్తలకు బహుమతి లివ్వడం కూడా అసాధారణమే.ఏ సినిమాల్లోనో...,ఏ సీరియల్ లోనో...మాత్రమే జరుగుతుంటాయి.
కానీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో జరిగిన పుట్టినరోజు వేడుకలో మాత్రం కోడలు.. కోడలా? కూతురా? అంతకన్నా ఎక్కువా? అనేలా దాదాపు కోటి రూపాయల బహుమతులతో అత్త యాభై పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడం అందర్నీ ఆశ్చర్య చకితులను చేసింది.
రాజోలు చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కాసు శ్రీనివాస్ - భవానీ దంపతులు లకు జన్మించిన సుకేష్ కు రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన శ్రీరంగనాయకి తో వివాహం జరిగింది.అప్పటి నుండి అత్తా మామలు తనను కన్న తల్లిదండ్రుల వలే చూసుకుంటున్నారంటు వేడుకలో కన్నీటి పర్యంతం అయింది. దీంతో అత్త భవానీ 50 వ పుట్టినరోజు నాడు ఎవరు చేయలేనంత అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుక చేయాలని ఆలోచన చేసింది. దీనిలో భాగంగానే నాలుగు
(1) పట్టుచీర,పసుపు కుంకుమ, గాజులు,మంగళసూత్రం..(2) వంద గ్రాముల బంగారు బిస్కెట్..(3) ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్..(4)యాభై లక్షల యాభై రూపాయల యాభై పైసలు నగదు వంటి భారీ బహుమతులు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది.తన అత్త పుట్టినరోజు కలకాలం గుర్తుండిపోయేల చేశారు. మొదట యాభై అడుగుల పుష్పాలంకరణలో పాదాలు వేసి, ముత్తైదువులతో హారతి ఇచ్చి యాభై అడుగులలో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ లోపలకు నడిపించారు.అనంతరం స్థానిక ప్రముఖ వైద్యులు అచ్యుత్ సమకూర్చిన భారీ కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. అనంతరం వేడుకలకు విచ్చేసిన వందలాది ముత్తైదువులు భవానీని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు.