ఆ రెండు ఎద్దుల ఖరీదు 54 లక్షలు... వీటి ప్రత్యేక ఇదే - TV9
నంద్యాల జిల్లా పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డిది వ్యవసాయ కుటుంబం. అయనకు వ్యవసాయంతో పాటు ఎద్దులను కొనుగోలు చేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చి పోటీల్లో పాల్గొనడం హాబీ. ఈ క్రమంలో ఆయన పల్నాడు జిల్లాకు చెందిన రెండు ఎద్దులను ఏకంగా 54 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. వాటిలో ఒకదానికి తెల్లదొరలకు ఎదురునిలిచి పోరాడిన స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. మరోదానికి అతనికెంతో ఇష్టమైన ఇంద్రసేనారెడ్డి పేరు పెట్టారు. పేర్లకు తగ్గట్టుగానే వాటిని ప్రత్యేకంగా పోషిస్తూ పోటీలకు సిద్ధం చేశారు. ఈ ఎద్దులకు ఆహారంగా ప్రతి రోజు ఉదయం,సాయంత్రం పటిక బెల్లం,కలకండ, ఉలవలు, బార్లీ బియ్యం, బళ్ళారి కొబ్బరె నూగులు, వాము, ఓజ కలగలిపిన సద్దతో పాటు
ఖర్జూరం, అరటిపండ్లు, బాదం, బీన్స్ ఇస్తారు. వీటి ఆహారం కోసం నెలకు 30 వేల వరకూ ఖర్చు అవుతుందని కేశవరెడ్డి తెలిపారు. రెండు రోజులకు ఒకసారి ఎద్దులకు పోటీలకు సంబంధించిన బండలు కట్టి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఇప్పటివరకూ ఈ ఎద్దులు 66 పోటీల్లో పాల్గొన్నాయని, అన్నిటిలో తమ సత్తాచాటాయని సగర్వంగా చెబుతున్నారు రైతు.
►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
#bulls #latestnews #tv9telugu
Credits : Rajeswari / Producer #tv9d
Uploaded By : durga