చిరకాల స్మ్రుతులలో నిలిచిపోయే ఒక మధురమైన ప్రయాణం :)
A Travel Story that you can cherish as a life long memory.
Includes: Adventures, Exploration, Off the Grid living, Native Foods, Special Tastes, Godavari region culture, traditions, beauty & foods.
Sri Vasavi Kanyaka Parameswari Story: http://www.penugondavasavi.org/about.aspx
0:00 Day-0 Palakollu
4:25 Day-1 Dindi Resorts
9:42 Day-2 Private Island
14:06 Day-3 Movie Locations
20:10 Day-4 Native Foods
#కోనసీమ అందాలు
మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు ,పచ్చని చెట్ల తోరణాలు ,అరటి గెలలు, కొబ్బరి తోటలు , కోడిపందాలు ,అంతర్వేదిలో గోదావరి సాగరసంగమంలో పడవ ప్రయాణం మరపురాని ఒక మధురానుభవం. పచ్చని పంట పొలాలు... ఆకాశాన్ని తాకేలా పెరిగిన కొబ్బరిచెట్లు...పుష్కలమైన ప్రకృతివనరులు. కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.
#పంటపొలాలు
కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.
#సంస్కృతి_సంప్రదాయాలు_పండుగలు
కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ - సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. తెలుగు సంవత్సరాది ఉగాది, సంక్రాంతి కోనసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలు.
#పలకరింపులు
కోనసీమ పలకరింపులు భలేగా ఉన్నాయి. చాలా సినిమాలలో అబ్సర్వ్ చెసింటారనుకోండి ..! ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. సంప్రదాయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే కోనసీమ రాక తప్పదు. ఎవరు కనబడినా ఆప్యాయంగా పలకరించడం వారి సంస్కారం.
#దేవాలయాలు
కోనసీమ ప్రాంతంలో పర్యాటకులు ఎన్నో దేవాలయాలను చూడవచ్చు. వాటిలో ప్రధానమైనవి మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి, ర్యాలీ లో గల జగన్మోహిని కేశవ స్వామి గుడి, ముక్తేశ్వరం లోని క్షణ ముక్తేశ్వరాలయం, ముక్తేశ్వరాలయం పలివెల లోని శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర ఆలయం, మందపల్లి లోని శనీశ్వర ఆలయం, అయినవిల్లి విగ్నేశ్వర ఆలయం , అంతర్వేది లక్ష్మి నృసింహా ఆలయం, etc.
#కోనసీమ_వంటలు
కోనసీమ వంటలు ఆహా ..! అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్ లకు కోనసీమ పెట్టింది పేరు. ఆంధ్రా చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. అట్లు, పెసరెట్టు టిఫిన్ కు బాగుంటాయి. మధ్యాహ్నం లంచ్ కి పిక్కల్(చట్నీలు) లేకుండా ఇక్కడి వారి భోజనం పూర్తికాదు. ఇక్కడికి వెళితే పూతరేకులు తప్పక తినండి.
#సినిమా_షూటింగ్లు
కోనసీమ సినిమా షూటింగ్ లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఇక్కడ ఎన్నో టాలీవూడ్ సినిమా లు చిత్రీకరించారు. మేము ఈ ట్రిప్ లో 4 లేటెస్ట్ సినిమాల లొకేషన్స్ కవర్ చేసాం .
లోమశ రిషి పాండవులకు తెలియచేసిన ఎన్నో విలువైన కథలులా ఈ కోనసీమ కథ మీకోసం.