రాగం : షణ్ముఖ ప్రియ
ఆనంద రస సుందరీ… బ్రహ్మానంద రస సుందరీ… ఆనంద రస సుందరీ
1. కన్న తల్లివి నీవు కాళిమాతవు నీవు
అన్నపూర్ణవు నీవు ఆదిశక్తివి నీవు
2. శక్తి ముక్తి భుక్తి ప్రదాయిని భుజంగ మాలిని బుద్బుధ పాలిని
కామ క్రోధ లోభ మోహ నాశిని- కాత్యాయని దాక్షాయణి రక్షాయని
3. పూల కిన్నెర లోన పాలు పొసగిన దాన
ఎన్ని జన్మలకైన నిన్నూ మరువానమ్మ
4. సృష్టి స్థితి లయ కారిణీ జనని శార్వాణి త్రిభువన పాలిని
రాగ తాళ నృత్యగాన రూపిని- రాజేశ్వరి విజయేశ్వరి అభయేశ్వరి
5. పాద క్రాంతుడ నీదు వేదాంత కని నేను
పేదోడైతెనునేమి ఏదో నీ కృప జాలు
6. భూత భవిష్యత్ వర్తమానముల పోషించెదవో ఘోషించెదవో
నన్నుగన్న నిన్ను యెంచ తరమా- విజయంకరి అభయంకరి శివశంకరి