కలర్ తక్కువ అయితే క్రేజ్ తక్కువా.... 😒||aiswarya rajesh craze at tirupati#trending #sankranthiteam
కలర్ తక్కువ అయితే క్రేజ్ తక్కువా.... 😒||aiswarya rajesh craze at tirupati#trending #sankranthiteam
సంక్రాంతికి వస్తున్నాం' మూవీ యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. తిరుపతిలో 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ మీట్ నిర్వహించారు. స్థానికంగా ప్రదర్శిస్తున్న థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సంక్రాంతి వస్తున్నాం యూనిట్ వీక్షించింది. అనంతరం డైరెక్టర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా చూసిన వాళ్లే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు.. చాలా సంతోషం అని అన్నారు. ఈ రోజుతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఎఫ్2 రికార్డును బ్రేక్ చేసిందని తెలిపారు. సినిమా అన్ని కేంద్రాల్లోనూ అద్భుతంగా ప్రదర్శించపడుతోందని.. విక్టరీ వెంకటేష్తో ఇది తమకు మూడవ సినిమా.. ఇది కూడా సూపర్ హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ పేర్కొన్నారు. మరోసారి సంక్రాంతికి తమ సినిమా రావడం.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ సినిమాతో పాటు తన అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా హిట్ అవడం సంతోషమని అనిల్ రావిపూడి తెలిపారు. మూడవసారి కూడా తమ కాంబినేషన న్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు.. చిరంజీవితో త్వరలో సినిమా ఉంది.. స్టోరీ డిస్కషన్ జరుగుతోంది.. ఆ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ చేస్తానని డైరెక్టర్ చెప్పారు.