#DANADANAMOGINADARUVE l #MADIGADAPPULADANDORA l #EMMADIASHOK l #TELANGANAFOLKSONGS l #GALAMTV
Writer: Bollikonda Sampath
Singer: Emmadi Ashok
Chorus: Rotnala Shyam, Bhaskar
Music: Wilson
DOP Editing DI: Santhosh Star
Producer Dasari Bhaskar
ధన ధన మోగిన దరివే
మాదిగ డప్పుల దండోరా
ధరణి దద్దరిల్లేలా దళిత
ముందు కురికి రారా
అణగారిన బతుకుల్లో
ఆశాజ్యోతే దండోరా
అగ్రకులాల అంతు చూడ
మోగించరా దండోరా
ఆది జాంబవుని వారసులం
మన కదురు లేదు ఇక బెదురు లేదు
ఊరిలోకి మేమడుగు బెట్టితే
మైల బడుతదని కమ్మగట్టిరి
అరే తుమ్మిన దగ్గిన ఉమ్ముతరని
మా మూతి చుట్టు ముంతలను గట్టిరి
తిండి లేక మరి నిద్దుర రాక
ఆకలి మంటలో అల్లాడుకుంటూ
ఊరి చెరువులో నీళ్లు తాగితే
ఉరులు తీసి వేలాడగట్టిరి
మమ్ము ఊరి అవతలికి వెల్ల గొట్టగా
వెలి వాడల్లో లొల్లి లేపే
పైస ఇచ్చి పది పైసలప్పని
పంట పొలాలను పట్ట చేసుకొని
సేద్యం చేయ సెంటు భూమి
లేకుంట దోచుకుని మోసగించిరి
తరతరాల ముత్తాతల నుండి
తండ్రుల నుండి తనయుల దాకా
చల్ కుక్కకింత బొక్కేసినట్లుగా
కాల్ల కింద చేప్పోలే నలిపిరి
అంటరాని వారిని చేసి
మమ్మేల్ల గోట్టగా రగిలినదే
సచ్చినటి జంతువుల తొల్లు
చల్ చెప్పుల జోలతో చెలిమి చేసెను
సకల జాతులకు సాయం చేసి
సవాలుగా సంబంధం కలిపెను
ఎట్టి చేసిన మట్టి బిడ్డలా
ఎదలో ఎతలను తట్టి లేపేను
చల్ హంటర్ దెబ్బల నంతం చేయగా
దళిత వాడలో దండు పుట్టెను
చెప్పులు కుట్టిన చేతుల డప్పుల
దరువులయ్యి మరి నిప్పుల కక్కెను
తంగేడు చెక్క ఉప్పు సున్నముతో
పశు చర్మాన్ని లందలో దాసి
అరే పాదరక్షాలు పానీయ తిత్తులు
జక మొక సంచులు జోల సంచులు
అరే పండ్రాయి పని కత్తి ఆరెలతో
అచ్చు కోసి అందంగా మలిచెను
పలు రకాల పనిమోట్లను చేసి
ధరణిలో నిలిచేను దళిత బిడ్డలు
దళిత బిడ్డల ధైర్యం ధరణిలో
నలు దిశల్లోనా నాదమయ్యి
కులము పేరుతో కుట్రలు పన్ని
కూటికి చంపి కాటికి పంపిరి
చీటికి మాటికి చీదరించి
మమ్ము ఊరికి చివరన విసిరి కొట్టిరి
అరే నాటి నుండి ఈనాటి దాకా
మన దళిత బిడ్డలను గోస పెడుతుంటే
నేటికైన ఎదిరించి వాల్లకు
గూటం గుద్దుల మోత చూపరా
చెప్పులు కుట్టిన చేతులే నేడు
చరిత్ర పూటలను తిరగరాయగా