చక్కనయ్యా సాయి బాబా ఎక్కడున్నావు//, తెలుగు భజన పాటలు //, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
చక్కనయ్యా సాయి బాబా ఎక్కడున్నావు
ఎంత వేడిన చింత తీర్చవు ఏమి నా నెపము
ఎందు వెతకిన అందు కలవని ఎందరెందరో అందురే
ఎందు వెతకిన కానుపించవు ఎందు వలనయ్యా
ఎందు వలనయ్యా
చింత బాపెడి నీదు నామ చింతన నా చెంత లేదని
వింత మనిషిగా ఎంచినావా పంతమేలనయా
పంతమేలనయా
దాన ధర్మము చేయలేదని దానవునిగా ఎంచినావా
మనసు విప్పి మాటలాడవు మౌనమేలనయా
మౌనమేలనయా
అండ పిండ బ్రహ్మాండ నాయక ఆశ్రిత ఆనంద దాయక
అండ నీవని ఆశ్రయించితి ఆదరింపుమికా
ఆదరింపుమికా
నీదు పదములే నమ్మినాను నీదు పాటలె పాడినాను
ఆపదలను బాపరావా ఆలసింపకను
ఆలసింపకను
దేవ దేవా సాయి దేవా దాసకోటిని బ్రోవరావా
ధ్యాస నీపై నిల్పినాము దర్శనంబిడవా
దర్శనంబిడవా