శరణం గణనాయకా విజయ వినాయక//, తెలుగు భజన పాటలు//, devotional songs
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
జనని శివ కామిని పాట స్టైల్
శరణం గణనాయక
విజయ వినాయక ముక్తిదాయకా
జగములనేలే దైవము నీవే
అగణిత రూపా గణపతి దేవా
నీ పదములనే నమ్మితి మయ్యా
హరహర శంకర గౌరి సుపుత్రా
గజముఖ రూపా హిమగిరి వాసా
అభయమొసంగి శుభములు కూర్చు
నీ పాద సేవా కైవల్య త్రోవా
మూషిక వాహన పాహి గణేశా
కుడుములుండ్రాళ్ళు పొందుగ నీకు
విందును జేతుము సుందర రూపా
మా పూజలంది మా సేవలంది
మా కార్యములను సఫలము జేయుమ