భూమిమీద పశువులకు మేత కరువైంది.. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. బావుల్లో.. చెరువుల్లో నీరులేక పచ్చిమేత ఎండిపోయింది. పశువులు బక్కచిక్కిపోతున్నాయి. రైతన్నకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. విధిలేక కన్నబిడ్డలా చూసుకున్న కాడి ఎద్దులతోపాటు పాడి పశువులను కసాయివాడికి అప్పగిస్తున్నారు..ఇలాంటి నేపథ్యంలో కరవులోనూ...ఆరుతడిలో పచ్చి మేతను అందించే కొత్తరకం వరి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది.