పద్య సుధా మంజరి చానెల్ ప్రేక్షకులకు వినయపూర్వక విజ్ఞప్తి:
ఆవిరి యోడలో అను పద్యం లోని చివరి పాదంలో "సతమున్" అనే పదము miss అయింది...
ఏ పుష్పంబునుజేసి అనే పద్యం లో మూడవ పాదం లో సమస్త అనే పదానికి బదులు సకల అని పొరపాటున చదవడం జరిగింది.
ఈ రెండుపూర్తి పద్యాలు దిగువన ఇస్తున్నాను సవరించుకుని చదువుకోగలరని ప్రార్దన.
ఉ. ఆవిరియోడలో, జలధియాన మొనర్చెడు బాటసారులో
భూవర! రేవులందు దిగిపోయెద రించుక వెన్క ముందుగా
నీ వసుధాపణంబు పనియెల్ల ముగించి, స్వదేశగాములై
పోవుచు వచ్చుచుండ్రు సతమున్ బ్రజలీ నరజన్మ వర్తకుల్.
ఉ.ఏ పుష్పంబును జేసి వాడుకొనునో యీదేహమున్ దైవమో
భూపశ్రేష్ఠ! విచారమందకుము, మామూలేకదా? యీమృతి
వ్యాపారంబు సమస్త జీవులకు, విశ్వవ్యాఘ్రి గర్భంబునన్
మాపుల్ రేపులునెందరో; యిముడుచున్నారందు నేనొక్కతెన్.
ముంతాజ్ మహల్. జాషువా. వైరాగ్యంతో కూడిన పద్యాలు.గుర్రం జాషువా , పద్య పరిమళం , పద్య సౌరభం, పద్య నైవేద్యం. శ్రీ శ్రీ , నన్నయ , తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు , నాచన సోమన, పాల్కురికి సోమనాథుడు, ధూర్జటి, తెనాలి రామకృష్ణ , అల్లసాని పెద్దన, నంది తిమ్మన , భట్టు మూర్తి, తెలుగు పద్యాలు, వేమన శతకం, సుమతి శతకం,దాశరథి శతకం, దాశరథి కృష్ణమాచార్య,చాటువులు, తిరుపతి వేంకట కవులు,