MENU

Fun & Interesting

చినుకులా రాలి II Chinukula Raali II Nalugu Sthambhalata I Veturi I Rajan Nagendra I P Susheela I SPB

Mee, Veturi 2,560,076 lượt xem 4 years ago
Video Not Working? Fix It Now

Best of Veturi, Navatha, Rajan Nagendra, Jandhyala, SPB, Susheela,
This video is taken from the Veturi Geethanjali 2018 function held in Sri Sathyasai Nigamagamam, Produced by SAFE Organisation and telecast-ed Live in TV 9.
Video courtesy from SAFE.

చిత్రం : నాలుగు స్తంభాలాట, 1982

సాహిత్యం : వేటూరి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:

చినుకులా రాలి, నదులుగా సాగి,
వరదలై పోయి, కడలిగా పొంగు,
నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే, నా ప్రేమ,
నదివి నీవు, కడలి నేను,
మరిచిపోబోకుమా,
మమత నీవే సుమా,

చినుకులా రాలి, నదులుగా సాగి,
వరదలై పోయి, కడలిగా పొంగు,
నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే, నా ప్రేమ

చరణం:

ఆకులు రాలే, వేసవి గాలి, నా ప్రేమ నిట్టూర్పులే,
కుంకుమ పూసే, వేకువ నీవై, తేవాలి ఓదార్పులే,
ప్రేమను కోరే, జన్మలలోనే, నే వేచి ఉంటానులే,
జన్మలు తాకే, ప్రేమను నేనై, నే వెల్లువవుతానులే,
నీ నవ్వులే చాలులే,

హిమములా రాలి, సుమములై పూసి,
రుతువులై నవ్వి, మధువులై పొంగు,
నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ,
శిశిరమైనా, శిధిలమైనా, విడిచిపోబోకుమా,
విరహమై పోకుమా,... చినుకులరాలి

చరణం:

తొలకరి కోసం, తొడిమను నేనై, అల్లాడుతున్నానులే,
పులకరమూదే, పువ్వుల కోసం, వేసారుతున్నానులే,
నింగికి నేల, అంటిసలాడే, ఆ పొద్దు రావాలిలే,
నిన్నలు నేడై, రేపటి నీడై, నా ముద్దు తీరాలిలే,
ఆ తీరాలు చేరాలిలే,

మౌనమై మెరిసి, గానమై పిలిచి,
కలలతో అలిసి, గగనమై ఎగసి,
నీ ప్రేమ, నా ప్రేమ, తారాడే మన ప్రేమ
భువనమైనా, గగనమైనా,
ప్రేమమయమే సుమా,
ప్రేమ మనమే సుమా,

చినుకులా రాలి, నదులుగా సాగి,
వరదలై పోయి, కడలిగా పొంగు,
నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ

Comment