Lahirii lahiri Lahari Lo Movie Audio Lyrics Songs
Song:- Kallaloki Kallu Petti Choodalekunna
Singers:-K. S. Chithra, Udit Narayan
Music By:- M.M.Keeravaani
Original Song:-
https://youtu.be/31yIb_cuLYQ?si=39hHNci1HYfETWP6
Lyrics:-
ఏ కలవరమా...
ఓయ్ పరవశమా...
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
చింతపండే కారమయ్యి చంపుతుందండి
అదేరా ప్రేమంటే కన్నా
ఎదంతా వ్యాపించి నీ దుంప తెంచే ప్రేమ
ప్రేమ....ప్రేమ..ప్రేమ
చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా
ఎండను చూస్తే చలి వేస్తోందా
ఎదురుగా నువ్వున్నా విరహం పుడుతోంది
ఏ నిజమైనా కలగా వుంది
విసుగేదో కలిగింది దిగులేదో పెరిగింది
అసలేదో జరిగింది మతి కాస్తా పోయింది
అదేరా ప్రేమంటే చిన్నా
ఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ
చిటపట చినుకుల్లో పొడి పొడిగుంటోందా
చినుకే నీకు గొడుగయ్యిందా...
నిద్దురలో వున్నా మెలకువలా వుంది
మెలకువలోనే స్పృహ లేకుంది
చూపేమో చెదిరింది మాటేమో వణికింది
అడుగసలే పడనంది కుడి ఎడమై పోయింది
అదేర ప్రేమంటే బచ్చా
అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ.........