MENU

Fun & Interesting

Maata ichhi tapputaku Manishi kaadamma ||Bro. Nehru ||Bro Vijayson || Marthamma Gaaru||Sis. Esther||

LAMP MINISTRIES 96,903 3 months ago
Video Not Working? Fix It Now

ప్రభవునందు సహోదరి సోహోదరులకు వందనములు మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మ అనే ఈ నూతన ఆధరణ గీతం ప్రభువు కృపను బట్టి వ్రాసి పాడటం జరిగింది, ఈ పాట అనేక కృంగిన హృదయాలు మరియు వెలివేయబడిన జీవితాలు ప్రభువును చేత ఆదరించబడాలని ప్రార్ధించండి, అనేక మందికి షేర్ చేయండి. మార్తమ్మ గారు సాక్ష్యం మనకందరికీ తెలిసిందే, వారు ఈ వయసులో ఒంటరి జీవితం జీవిస్తున్నారు , సహోదరి ఎస్తేర్ గారి సాక్ష్యం మన ఛానల్ లో ఉంది చూడగలరు, బాల్యంలోనే వెలివేయ బడిన జీవితం, ఇలాంటి ఒంటరైన, వెలివేయబడిన జీవితాల కొరకు దేవుడు నాచేత వ్రాయించిన అద్భుత గీతం. వినండి ప్రార్ధించండి (సహోదరి ఎస్తేర్ సాక్ష్యం: https://youtu.be/1M07AmYVMto?si=Li-Y2UNe1SPL2DCf) LYRICS: మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మ మౌనముగా నుండుటకు రాయి కాదమ్మ మరచి పోవుటకు ప్రభుకి మరుపు లేదమ్మ విననేరక ఉండుటకు విసుగు రాదమ్మ గురుతేనమ్మ నీ స్తితి గురుతేనమ్మ ఎరుకేనమ్మ నీ వెతలెరుకేనమ్మ నీవంటే నీ తండ్రికి ప్రేమేనమ్మ తనచేతులలో నీ రూపం చెక్కాడమ్మ ||2|| | PALLAVAI:1 దూరమైనవా నీ ప్రాణమైన స్నేహాలు చెల్లిపోయనా నీవు అల్లుకున్న బందాలు ||2| కంటనీరై ఒలికేన కమ్మనైన స్వప్నాలు ఒంటరైన తరుణాన జంట అయిన గాయాలు ||2|| చీకటి కమ్మినా సాయం సంద్యలా వేకువ నిలిచినా జాబిలి బ్రతుకులా ||2|| మిగిలానని బ్రతుకేలని అనుకోకమ్మ అనుకోకమ్మా నువు చినబోకమ్మ దిగులేలమ్మ ఇది నీ కథ కాదమ్మ ||2|| చుసాడమ్మ ప్రభువు చుసాడమ్మ వస్తాడమ్మ వెలుగును తెస్తాడమ్మ ||2|| ఉదయించే సూర్యునిలా వస్తాడమ్మ తన నీడలో వెన్నలవై వెలిగేవమ్మ నీకోసం నీతండ్రి వస్తాడమ్మ తన ఒడిలో పసిపాపై నవ్వేవమ్మ ||మాట ఇచ్చి|| PALLAVAI:2 కాలమె శూన్యమై రేపు ఇక లేదంద లోకమె ఏకమై చీలిక చేసింద ||2|| మమతంత మనసులో మసకబారి పోయింద గుప్పెడంత గుండెలో మంటలెన్నొ రేపింద ||2|| కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు ||2|| మోడైన ఏమైనా నిలవాలమ్మ నిలవాలమ్మ నవ్వు గెలవాలమ్మ బ్రతకాలమ్మ సాక్షిగా వెలగాలమ్మ ||2|| తలచాడమ్మ తలపున తలచాడమ్మ నిలిచాడమ్మ తలుపున నిలిచాడమ్మ ||2|| కన్నీళ్లను చూసి ప్రభు కదిలాడమ్మ మరి ఎన్నాళ్ళో నీ పిలుపుకై వేచాడమ్మ వ్యధలన్ని ఏనాడో మోసాడమ్మ ఆ విడుదలనే నీకోసం తెచ్చాడమ్మ ||మాట ఇచ్చి|| Lyrics, Tune & Vocals - Bro. Nehru Gurijala Music - Bro. Vijayson Nallamothu Credit's: Key's Programming - Vijayson Mix & Masterd by -Hudson Taylor and Sam -Hyderabad DOP: Bro. Martha Rao Edit : Bro Nehru Copyright of this music and video belong to LAMP Ministries. Any unauthorized reproduction, redistribution or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited. ►Please pray for Lamp Ministries ►Contract: 9346428210 ►[email protected]

Comment