#pramutalks
#drprasadamurthy
మిత్రులారా జర్మన్ తత్వవేత్త ఫెడరిక్ నీషే చెప్పిన తాత్విక సూక్తులు గురించి చేసిన వీడియో ఇది. ఇక్కడ నేను ఉదహరించిన సూక్తుల టెక్స్ట్ ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు దీన్ని రాసుకోవచ్చు.
నీషే సూక్తులు
1.జీవితాన్ని ఇటు నుంచి అటు దాటే వంతెన నీకోసం ఎవరూ నిర్మించరు
దాన్ని నువ్వే కట్టుకోవాలి
2.చాలామంది సత్యం వినడానికి భయపడతారు. కారణం వారి
భ్రమ ఎక్కడ చెల్లా చెదురైపోతుందోనని
3.రాక్షసులతో పోరాడేవారే తిరిగి రాక్షసులయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త.
3.ఒకవేళ నువ్వు సుదీర్ఘకాలం లోయ వైపు చూస్తూ ఉంటే
లోయ కూడా నిన్ను చూస్తూ ఉంటుంది.
4.ఒక ఆలోచన రావాల్సిన సమయానికి వస్తుంది.
నేను కోరుకున్నప్పుడు కాదు.
5.మనుషులే ఎందుకు నవ్వుతారు అని ఎప్పుడూ ఆలోచిస్తాను. కారణం ఎక్కువ దుఃఖ భారాన్ని మోసేది మనిషే. దాని నుంచి బయటపడడానికి మనిషి నవ్వును కనుక్కున్నాడు.
5. అపవిత్రం కాకుండా దోషధారలను నీలో కలుపుకోవడానికి నువ్వు సముద్రానివి కావాలి.
6. మనం ఎంత పైకి ఎగురుతామో
అంత పైకి ఎగరలేని వారికి
మనం చిన్నగా కనిపిస్తాం
7. ఇతరులు 10 పుస్తకాల్లో చెప్పే మాటలని 10 వాక్యాల్లో చెప్పాలని నా మహా ఆకాంక్ష.
8. వివాహ బంధాన్ని దుఃఖభరితం చేసింది ప్రేమ లేకపోవడం కాదు, అది స్నేహం లేకపోవడమే.
9. మనల్ని హింసించేవాళ్ళు మనల్ని మరింత బలవంతుల్ని చేస్తారు
10.తమ గురించి తాము అధికంగా చెప్పుకునేవారు తమను తాము అధికంగా దాచుకుంటున్నారు.
ఎక్కువగా మాట్లాడడం కూడా తమను తాము ఎక్కువగా దాచుకోవడానికి ఒక సాధనం కావచ్చు.
11. నువ్వు నాతో అబద్ధం చెప్పావని నేను బాధ పడడం లేదు.
నా బాధంతా ఇక నేను నిన్ను విశ్వసించలేను.
12. నాట్యం చేసేవాళ్లను చూసి పిచ్చివాళ్లు అనుకుంటారు. కారణం వాళ్లలోని సంగీతాన్ని వినలేక పోవడమే.
13. ఏ రోజు మనం డాన్స్ చేయలేదో ఆరోజును కోల్పోయినట్టుగా భావించాలి.
14. తమ శత్రువుని ప్రేమించడమే కాదు, తమ మిత్రుని ద్వేషించడంలో కూడా సమర్ధులైన వారే జ్ఞానులు.
15. ప్రపంచంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు తెలుసుకోవాలనుకునే వారు, మరొకరు కేవలం ఉన్నదాన్ని విశ్వసించేవారు.
16. జీవితాన్ని జీవించడం తెలిసినవాడు దేన్నైనా సహించగలడు.
17. పరిపూర్ణమైన ప్రేమ ఉన్నవాడు మంచి చెడులకు అతీతంగా ఉంటాడు.
18. ఆశ ఎక్కువ దుఃఖ దాయిని. ఇది జీవితంలో దుఃఖాన్ని పెంచుకుంటూ పోతుంది.
19. ప్రేమ గుడ్డిది.
స్నేహం తన కళ్ళు మూసుకుంటుంది
20. తన ముందు తాను సిగ్గుతో తల ఉంచుకోకుండా ఉండడమే ముక్తి.
21. అదృశ్య దారం
అన్నిటికంటే బలమైన బంధనం.
22. సత్యం అంటే అందరూ అంగీకరించిన ఒక పెద్ద అబద్ధం.
23. నీ అంతరాత్మ నిన్ను ఎలా చూపిస్తుందో అలాంటి వ్యక్తిగా నిన్ను నువ్వు మలుచుకోవాలి. అదే నువ్వు.
24. ఒక భయంకర అగాధములో ఉన్న సౌందర్యాన్ని మించిన సత్యం లేదు
25. సంగీతం లేని జీవితం ఒక పెద్ద అపరాధం
26. ప్రేమ అనేది ఎప్పుడూ పిచ్చిదే కానీ ఆ పిచ్చితనానికి ఒక కారణం ఉంటుంది
27. ఎప్పుడూ తన గురించి ప్రశంసనే వినాలనుకునే ఈశ్వరుని నేను నమ్మను.
28. నీ దారి నీది. నా దారి నాది.
సరైన దారి, ఉచితమైన దారి, నిజమైన దారి అనేది ఉండనే ఉండదు.
29. మనం బాగా అలసిపోయినప్పుడు కొన్ని ఆలోచనలలో చిక్కుకుంటాం.
వాస్తవానికి మనం వాటిని ఎప్పుడో గెలిచేసాం.
30. ఒక యువకుడ్ని భ్రష్టుణ్ణి చేయాలంటే తనలాగే ఆలోచించేవాడిని అతను సన్మానించుకునేలా చేయడమే.
31. చింతనాపరుడు అబద్ధాన్ని గురించి కాకుండా నిజాన్ని గురించి ఆలోచించడానికే ఎక్కువ భయపడతాడు.
32. మనుషులు ఎప్పటి లాగే రెండు గ్రూపులుగా ఉంటారు. ఒకరు బానిసలు, మరొకరు స్వతంత్ర జీవులు.
తమ జీవితాన్ని తాము జీవించడానికి ఎవరి దగ్గర కొద్దిపాటి సమయం కూడా లేదో వారు బానిసలు.
వారు రాజకీయ నాయకులు కావచ్చు, ఒక వ్యాపారి, ఒక అధికారి లేదా ఒక విద్వాన్ కావచ్చు.
33. నాకు కేవలం ఒక కాగితం ఒక కలం చాలు,
ఈ దునియాని తల్లకిందులు చేస్తాను.
34. మౌనం అధమాధమం.
ఏ సత్యాన్ని మౌనంగా దాచి ఉంచుతారో అది విషయంగా మారుతుంది.
35. నేను ఎప్పుడు పైకి ఎక్కినా,
అహంభావం అనే కుక్క
నా వెంట పడుతుంది.
36. చివరిగా నేను కోరుకునేది ఏమిటంటే
అది నేను కోరుకునే వస్తువు కాదు.
37. తను చేయాల్సిన పనులు తెలిసిన రచయిత నోరు మూసుకోవాలి.
38. మరచిపోకుండా జీవించడం చాలా కష్టం
…………. ………..