MENU

Fun & Interesting

NTRAMARAO DHARMAPEETHAM - తెరవేలుపు-తెలుగుదేశం సృష్టికర్త జన్మించి నేటికి సరిగ్గా వంద ఏళ్ళు.

Journalist Diary 9,187,329 lượt xem 8 years ago
Video Not Working? Fix It Now

తెరవేలుపు-తెలుగుదేశం సృష్టికర్త జన్మించి నేటికి సరిగ్గా వంద ఏళ్ళు. ఆయనకు మా ప్రేక్షకుల తరఫున... మా తరఫున మా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ధర్మపీఠం కార్యక్రమం సరిగ్గా 1996 జనవరి 15వ తేదీన ప్రసారమైంది. అది ప్రసారమైన మూడోరోజున అంటే 18 జనవరిన ఆయన మరణించారు. ఇదే ఆయన చివరి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జెమినీ టీవిలో ప్రసారమైన సమయంలో ఆయన చూసి ఎంతో సంతృప్తికరంగా ఉందంటూ నాకు ఫోన్లో చెప్పారు. నా జీవితంలో ఇదొక మరపురాని ఘట్టం... అత్యంత విలువైన అనుభవం ! యూట్యూబ్లో 2016 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. జెమినీ టీవీ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు చేరువైన ఎన్టీఆర్ ధర్మపీఠం ఇప్పటికీ తెలుగు టీవీరంగంలోనే కనీవినీ ఎరుగని ఒక సంచలనం. అందుకే అది నాకు గర్వకారణం. మీ అందరి విశేష అభిమానానికి నోచుకున్న ఈ కార్యక్రమం మళ్ళీ మీకోసం మళ్ళీ ముందువరసలో నిలబెడుతున్నాను.

ప్రేమతో మీ
సతీష్ బాబు , జర్నలిస్ట్ డైరీ
28 మే 2023

Comment