MENU

Fun & Interesting

రైస్ రెసిపీలు | Rice Recipes | Bagara Annam | Nuvvula Annam | Sesame Rice | Bagara Rice

HomeCookingTelugu 26,460 3 months ago
Video Not Working? Fix It Now

రైస్ రెసిపీలు | Rice Recipes | Bagara Annam | Nuvvula Annam | Sesame Rice | Bagara Rice | @HomeCookingTelugu #రైస్రెసిపీలు #RiceRecipes #BagaraAnnam #NuvvulaAnnam #SesameRice #BagaraRice #homecookingtelugu #hemasubramanian Other Recipes: Dondakaya Ullikaram Rice - https://youtu.be/CxSghldE6hs Egg Rice - https://youtu.be/XMq_dqTkDR4 Pappu Thalimpu Annam - https://youtu.be/lQ-iOyeJo1g Chapters: Promo - 00:00 Bagara Annam - 00:12 Nuvvula Annam - 09:26 తయారుచేయడానికి: 5 నిమిషాలు వండటానికి: 20 నిమిషాలు సెర్వింగులు: 2 కావలసిన పదార్థాలు: నూనె - 1 టేబుల్స్పూన్ నెయ్యి - 1 టేబుల్స్పూన్ దాల్చిన చెక్క యాలకులు - 2 లవంగాలు - 4 అనాసపువ్వు మరాఠీ మొగ్గు జాపత్రి రాతిపువ్వు షాహీ జీరా - 1 టీస్పూన్ బిర్యానీ ఆకులు - 2 ఉల్లిపాయ - 1 పచ్చిమిరపకాయలు - 4 అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్ టొమాటో - 1 పుదీనా ఆకులు - 1 బౌల్ కొత్తిమీర - 1 బౌల్ ఉప్పు - 1 టీస్పూన్ బాస్మతీ బియ్యం - 1 కప్పు (30 నిమిషాలు నానపెట్టినది) నీళ్ళు - 1 1 /2 కప్పులు తయారుచేసే విధానం: ముందుగా ఒక కప్పు బాస్మతీ బియ్యాన్ని ఒక గంట సేపు నీళ్ళలో నానపెట్టాలి ఆ తరువాత ఒక గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేసిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, మరాఠీ మొగ్గు, జాపత్రి, రాతిపువ్వు, షాజీరా, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి తరువాత ఇందులో టొమాటో, పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి టొమాటోలు కాస్త మగ్గిన తరువాత ఉప్పు వేసి మొత్తమంతా కలపాలి ఇప్పుడు నానపెట్టిన బాస్మతీ బియ్యం వేసి, నీళ్ళు కూడా పోసి మొత్తం బాగా కలిపి, గిన్నెకి మూత పెట్టి, లో-ఫ్లేములో పావుగంట సేపు ఉడికించాలి మధ్యలో ఒకసారి గరిటెతో కలిపితే బాగుంటుంది బగారా అన్నం ఉడికిన తరువాత ఐదు నిమిషాలు మూత తియ్యకుండా మగ్గనివ్వాలి అంతే, ఎంతో రుచిగా ఉండే తెలంగాణ స్పెషల్ బగారా అన్నం తయారైనట్టే, దీన్ని వేడివేడిగా ఏదైనా మసాలా కూరతో సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది తయారుచేయడానికి: 5 నిమిషాలు వండటానికి: 15 నిమిషాలు సెర్వింగులు: 2 - 3 నువ్వుల పొడికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు - 2 టేబుల్స్పూన్లు మినప్పప్పు - 2 టేబుల్స్పూన్లు జీలకర్ర - 1 టేబుల్స్పూన్ ఎండుమిరపకాయలు - 8 మిరియాలు - 1 టీస్పూన్ చింతపండు ఎండుకొబ్బరి - 1 టేబుల్స్పూన్ నువ్వులు - 3 టేబుల్స్పూన్లు కల్లుప్పు - 1 టీస్పూన్ ఇంగువ - 1 / 4 టీస్పూన్ నువ్వుల అన్నం కోసం కావలసిన పదార్థాలు: నూనె - 3 టీస్పూన్లు పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్ మినప్పప్పు - 1 టీస్పూన్ పల్లీలు - 1 టేబుల్స్పూన్ జీడిపప్పులు ఆవాలు - 1 / 2 టీస్పూన్ ఎండుమిరపకాయలు - 2 కరివేపాకులు ఉడికించిన అన్నం - 1 బౌల్ నువ్వుల పొడి - 3 టీస్పూన్లు ఉప్పు - 1 / 4 టీస్పూన్ నెయ్యి - 1 టీస్పూన్ తయారుచేయడానికి: 5 నిమిషాలు వండటానికి: 15 నిమిషాలు సెర్వింగులు: 2 - 3 తయారుచేసే విధానం: ముందుగా నువ్వుల పొడి చేయడానికి ఒక ప్యాన్లో నువ్వుల పొడికి కావలసిన పదార్థాలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి పచ్చిదనం పోయేంత వరకూ వేయించాలి ఇవన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి వీటిని పూర్తిగా చల్లార్చిన తరువాత ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడి పట్టాలి ఇప్పుడు నువ్వుల అన్నం చేయడానికి ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పులు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తరువాత ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకులు వేసి వేయించాలి పప్పులు అన్నీ బాగా వేగిన తరువాత ఉడికించిన అన్నం వేయాలి ఇందులో ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి అంతే, ఎంతో రుచిగా ఉండే నువ్వుల అన్నం తయారైనట్టే, దీన్ని ఉన్నపళంగా తినచ్చు Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook- https://www.facebook.com/HomeCookingTelugu Youtube: https://www.youtube.com/homecookingtelugu Instagram- https://www.instagram.com/home.cooking.telugu A Ventuno Production : http://www.ventunotech.com

Comment