“భాగ్య చక్రం" లో “వానకాదు వానకాదు" అను వరుస
రచన & కీబోర్డు :శ్రీ రమేష్ బాబు శీపాన
గానం : శ్రీ ఈదరాడ వీర బ్రహ్మం
డోలక్ : శ్రీ సుంకరి నర్సింగ రావు
పల్లవి:
చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ చిన్మయ కృష్ణా
మన్ను తిన్న వన్నెల కృష్ణ మహిమల కృష్ణ
చరణం: 1
దేవకి వసుదేవుల సుతుడై దివ్యత్వముతో
పావన యమునా నది దాటి పల్లెను చేరి
భూవరుండు నందునింట పూజ్యనీయ యశోద చెంత
నీలీలా కార్యమెల్ల నిత్య క్రీడలంట గదరా
||చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ ||
చరణం : 2
మామ కంసుడంపినయసురుల మాయలనెరిగి
తామసులను దండనజేసి తనువులు బాపి
భామలైన గోపికలకు, బాలురైన గోపకులకు
ప్రేమ పంచి వేణువూద పెక్కు మోదమందిరంటా
||చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ ||
చరణం : 3
నటనమాడి కాళీయునిపై, నగ ధరియించి
పటిమ తోనె కంసుని జంపి పాలన మార్చి
నటన సూత్రధారి నీవు న్యాయమున్న వారివైపు
భటుడు నీ రమేషు బాబు బంధుప్రీతినాదరించు
||చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ ||
భజన కార్యక్రమాల విస్తృత శ్రేణిలో మా ప్రత్యేకతలు":
*శ్రీకరమైన అన్నమయ్య, రామదాసు కీర్తనలు,
సినీ భక్తి గీతాలు, సినీ గీత అనుకరణ గీతాలు,
వివిధ కవుల కీర్తనలు, భజనలు, జయదేవుని అష్టపదులు,
ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత,
యమ్ యస్ రామారావు గారి “సుందరకాండ" గానము,a
సమయోచిత వ్యాఖ్యానములు, సందర్భోచిత గాన
వాయిద్య ప్రక్రియలు, సరాగబద్ధ పద్య ప్రయోగములు.
*ఆలయ ప్రతిష్ఠాపనలు, వార్షికోత్సవములు,
సమారాధనలు, ఉత్సవములు, పండుగ రోజులు,
గృహప్రవేశములు, గృహంలో ప్రత్యేక పూజలు
మరియు ఏ దైవకార్యముల కొరకైనా మా
“భక్తి గీతాంజలి" వారిని సంప్రదించగలరు.
*ప్రత్యేక గానవిశేషము:-
దశకంఠ రావణ విరచిత “శివతాండవ స్తోత్రము“
To schedule program with us (Contact):
Shree Geethacharya Bhakthi Geethanjali
Steel Plant, Visakhapatnam.
+91 8926683333
To Audio Recording and Video Editing (Contact):
Shree Lakshmee Srinivasa Studios
Steel Plant, Visakhapatnam.
+91 8926683333