MENU

Fun & Interesting

Sai Gurukulam Episode1300//సాయి ఆనంద లోకాన్ని మరింత మధురంగా బాబా ఎలా ఆవిష్కరించనున్నారో తెలుసుకొండి.

SAI TV Live Telugu 3,885 9 months ago
Video Not Working? Fix It Now

Sai Gurukulam Episode1300//సాయి ఆనంద లోకాన్ని మరింత మధురంగా బాబా ఎలా ఆవిష్కరించనున్నారో తెలుసుకొండి. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింప వచ్చును. (1)నిర్గుణస్వరూపము, (2) సగుణస్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు. సగుణస్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములును పరబ్రహ్మవే. మొదటిదానిని కొందురు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణస్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారముతో నున్నాడు. కావున భగవంతుని గూడ ఆకారముతో నున్నట్లుగానే భావించి, పూజించుట సులభము; సహజము. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ళవరకు సగుణస్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని వృద్ధిచెందవు. రానురాను ఆ భక్తి నిర్గుణస్వరూపమగు పరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము - ఈ ఏడు పూజింపదగినవి. కాని సద్గురవు వీని యన్నిటికంటె సుత్కృష్టుడు. ఈ సందర్భములో సాయినాథుని మనమున ధ్యానించెదము. వారి నిర్మోహమున కవతారము; పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులయందుగల భక్తియే యాసనము. మనకోరికలన్నియు నిరసించుటయే సంకల్పము (పూజ ప్రారంభించి పూర్తిచేసెదమను మనో నిశ్చయము). కొందరు సాయిబాబా భగవద్భక్తుడనెదరు. కొందరు మహాభాగవతు డందురు. కాని మాకు బాబా భగవంతుని యవతారమే. వారు తప్పు చేసినవారిని క్షమించువారు. ఎన్నడు కోపించువారు కారు. సూటిగను, నెమ్మదిగను, ఓర్పుకలిగి, సంతుష్టిగ నుండువారు. శ్రీ సాయిబాబా యాకారముతోనున్నప్పటికి నిరాకారస్వరూపులు. వారెల్లప్పుడు ఉద్రేకము, అభిమానము లేకుండ నిత్యముక్తులుగా నుండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగజేయుచు చెట్లకు చేమలకు జీవకళ నిచ్చుచు ననేకుల దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయివంటి యోగులు తమ జీవనము తాము గడపుచు తక్కినవారందరికి సుఖమును ఓర్పును ప్రసాదించుచున్నారు. భగవద్గీతయందు శ్రీ కృష్ణుడు యోగి తన యాత్మయనియు, జీవత్ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింప నలవికాని యా సత్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిరూపముగా నవతరించెను. శ్రుతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణించుచున్నవి (తైత్తరీయ ఉపనిషత్తు). ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మస్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా యెవరిని యాశ్రయించి యుండలేదు. వారి యాసనము కొరకు గోనెసంచి నుపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్నపరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల యభిప్రాయము నెరవేర్చును. వారి యిష్టానుసారము తనను పూజించుట కెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు చామరముల తోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించునట్లు గాన్పించినప్పటికి వారు సర్వాంతర్యామి; ఎక్కడ జూచినను వారే యుండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజు అనుభవించుచుండెడివారు

Comment