సంకష్టహరచతుర్థికి విజయదీపం/బెల్లం దీపం కోరికలు త్వరగా నెరవేరుతాయి | sankashtaharachathurdi
Sankashtahara chathurdi pooja vidhanam 2024 | సంకష్టహరచతుర్థి వ్రతం చెయ్యలేనివారు కోరిక తీరేలా పూజ
Sankashtahara chaturdi pooja vidhanam
sankashtahara chathurdi pooja vidhanam 2023 date | sankatahara chathurdi eppudu | సంకష్టహరచతుర్థి
sankashtahara chathurdi 2023, sankashtahara chathurdi 2023 date, sankatahara chaturdi 2023, sankatahara chaturdi 2023 date, sankashta chathudi eppudu chesukovali, karthika masam sankashtahara chaturdi,kubera chaturdi eppudu, sankashtahara chathurdi pooja vidhanam, saknashtahara chaturdi pooja vidhanam in telugu, sankatahara chaturdi pooja, sankashtahara chaturdi pooja in telugu,chaturdi pooja in telugu, sankashtahara chathurdi telugu pooja vidhanam, sankatahara chaturdi karthika masam pooja vidhi, sankashtahara chathurdi kab hai, sankashtahara chathurdi kaise karna, sankashtahara chaturdi mudupu ela kattali, sankashtahara chaturdi, sankashtahara chathurdi, sankashtahara chaturdi benefits, sankashtahara chaturdi importance, sankashtahara chaturdi pooja el cheyali, sankatahara chathurdi pooja easy ga ela cheyyali,sankatahara ganesh stotram,vijaya deepam,bellam deepam, sankashtahara january pooja
సంకట హర చతుర్ధి వ్రత కథ:- ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి ( వినాయకుని గొప్ప భక్తుడు ) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్‌సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు.
సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది' అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
#sankashtaharachaturdi2023
#sankashtaharachathurdi
#sankashtaharachaturdipoojavidhanamintelugu
#sankashtaharachathirdidate
#karthikasankashtaharachathirdi
#sankataharachathurdipoojavidhanam
#sankashtaharachathurdieppudu
#umasscutehome
#festivals
#remedies
#umascutehomepoojavlogs