MENU

Fun & Interesting

Sri Subrahmanya Swamy Padamalika || Lord Subramanya Devotionals || Devotional Song || My Bhakthi Tv

MyBhaktitv 445,831 lượt xem 3 years ago
Video Not Working? Fix It Now

Title: Sri Subrahmanya Swamy Padamalika
Lyrics: Rayancha
Composed by: Baggam Dhananjaya
Singer: V.Akhila
#subramanyaswamysongstelugu
#devotionalchants
#devotionalsongsintelugu
#subhramanyasongs
#chalisa
Sri Subrahmanya Swamy Devotionals
Published By : Musichouse
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)

సుబ్రహ్మణ్య చాలీసా

సుజనులార భక్త జనులారా
శ్రద్ధగ మీరు వినరండీ
సుబ్రహ్మణ్యుడి చరితమును
చాలీసాగా తెలిపెదము || సుజనులారా ||
బ్రహ్మ వరముతో జనియించే రాక్షసుడు తారకాసురుడు
వాడు ఘోరమగు తపసును చేసి బ్రహ్మచే పొందెవరములను
వరగర్వముతో తారకుడు దేవతలను బాధించేను
దేవతలంతా బ్రాహ్మణు చేరి కాపాడమని వేడేరు || సుజనులారా ||
దేవతలంతా వినుడుయిటు నేనిచ్చిన వరము కఠినతరం
శివుని వీర్యమున జన్మించే పురుషునిచే తారకుడంతమగు
శివపార్వతులను కలపండి వారికి పెండ్లి జరిగినచో
కుమారస్వామి జన్మించు తారకునాతడెవధియించు || సుజనులారా ||
అంతట అందరు మన్మధుని వేడుకొనిరి ఈ తీరుగను
శివపార్వతులను మోహముతో నీవె ముంచవలెనని అనిరి
వారికలయిక ఫలితముగ శివుని వీర్యము లభియించు
అగ్నిహోత్రమున అది ఉంచ స్యందుడను కుమారుడుదయించు || సుజనులారా ||
అగ్నిహోత్రుడా శివ వీర్యం కలిగించే బాధ పడలేక
దానిని తన సతి స్వాహాకు అందించె ముని సతుల రూపమున ఆ
వీర్యపు వేడిమి తాళలేక స్వాహా దానిని విడిచెనండి
కైలాసమందొక శిఖరమున అది ఆకాశగంగను చేరెనుగా || సుజనులారా ||
ఆకాశగంగా వీర్యమును గట్టుకు చేర్చెను ముక్కలుగా
క్రమక్రమముగ విరిగిన ఆ వీర్యం రెల్లు దుబ్బులను చేరినది
కొంతకాలముకు పక్వమైన ఆ వీర్యం ఒక శుభదినము
మార్గశీర్ష శుద్ధ షష్టియందు సూర్యోదయపుకాలమున || సుజనులారా ||
ప\న్నెండు చేతులరుముఖములతో దివ్యాయుధకిరీటముతో
ఓంకారయుక్త వేదములన్నీ చర్చిస్తూ తానుదయించె
జగదేకవీరుడు అయినట్టి షణ్ముఖుడు కుమారస్వామి
లోకాలన్నీ మురిసిన విజయజయ ధ్యానంచేసినవి || సుజనులారా ||
పార్వతీ సహితుడై శివుడు కైలాసాచలమున కొలువుండ
బ్రహ్మవిష్ణుమహేంద్రాదులు సకల దేవతలు వేంచేయగా
నందీశ్వరుడు గంగాతటికి వెళ్లి షణ్ముఖునికి ప్రణమిల్లి
శంకరుడు మిమ్ముగొనితెమ్మని పంపినాడని పలికెనుగా || సుజనులారా ||
కుమారస్వామి సంతసించి నందీశ్వరునిచె తేబడిన
పుష్పక విమానమందుతను షట్ కృత్తికలను వెంటనిడి
కైలాశమునకు ఏతెంచే శివపార్వతులను దర్శించే
పార్వతీపరమేశ్వరులంత కుమారునాలింగనము చేసిరి || సుజనులారా || బ్రహ్మదేవుడంతకుమారస్వామి కృత్యములను సభకుగ్గడించి
దేవసేనయను కన్యకను పెండ్లి చేయుటుక్తమని పల్వె
ఆమాటకందరు సంతసించి ఆ ప్రయత్నమును సాగించిరి
కుమారస్వామికి మొదటగను ఉపనయనమును కావించిరి || సుజనులారా ||
శుభముహుర్తమున ఒకనాడు పెండ్లి కావించిరి దేవసేనతో
దేవతలంతాదీవించి అనేక వరముల నొసగితిరి
దేవతలనుకాపాడుటకై షణ్ముఖుని సేనాధిపతిగా
పంపించమని ఇంద్రుడంత పరమేశ్వరుని ప్రార్ధించే || సుజనులారా ||
శంకరుడంతట సరేయని దేవతాగణములకధిపతిగా
కుమారునినియమించేను స్వర్గమునందున ఉంచెను
తారకుని తుదముట్టించి దేవతలను రక్షింపుమని
బ్రహ్మవిష్ణుదేవేంద్రాదులు కుమారస్వామిని కోరేరు || సుజనులారా ||
వానిని తప్పక చంపగలవని శివపార్వతులు వరమివ్వ
కుమారస్వామి కదిలేను తారక సంహారముకొరకు
శివుని వీర్యమున జన్మించిన షణ్ముఖుడు దేవసేనానిగా
తారకునిశోణితాపురికి దండెత్తనున్న వార్తతెలిసినది || సుజనులారా ||
తారకుడు పరమశివభక్తుడు శివుని పార్థివలింగమును
బిల్వ పత్ర సహితార్చనతో పరమనిష్టగా పూజించే
కుమారస్వామి యుద్ధముకు రంగం సిద్ధంచేసేను
మంచిగస్వర్గం వదలమని తారకునికి కబురంపేను || సుజనులారా ||
ససేమిరంటూ తారకుడు రణమునకే కాలుదువ్వేను
షణ్ముఖ తారకులిరువురికీ వెయ్యేళ్ళు పోరుజరిగేను
అయినా తారకుడంతమయే మార్గముకనిపించకపోయే
అంతట నారదమహాముని తారకుని మర్మమెరిగించే || సుజనులారా ||
తారకుని కంఠమందున్న పార్థివ లింగమే అతని బలం
దానినయిదు ముక్కలుగాను ఖండించినచో చచ్చెదడు
కాని వెంటనే ముక్కలకు ఆలయములు కట్టించవలె
లేనిచో వెంటనే ముక్కలన్నీ పార్థివ లింగముగా మారు || సుజనులారా ||
వెంటనె షణ్ముఖుడట్లెయని సూర్యుడ్నీరీతి ప్రార్దించె
పార్థివలింగపు ముక్కలకు ఆలయాలు నిర్మించమనె
ఆ తీరుగ అయిదుముక్కలను పంచభీమేశ్వర లింగములై
ప్రసిద్ధి కాంచెను లోకమున తారకుని అంతమయ్యినది || సుజనులారా ||
అంతట షణ్ముఖుడొకనాడు వ్యాహాళికిచనె మిత్రులతో
అచ్చట పుళిందదేశమున సుందరియగు వళ్ళీనిచూసే
నారదుడిచ్చిన సలహాతో షణ్ముఖుడు వల్లిని పెండ్లాడె
వల్లీ దేవసేన సమేతుడై మయూర వాహనుడయ్యెస్వామి || సుజనులారా ||
పళనియందు సుబ్రహ్మణ్యునిగా గురువాయూరేన కుమారునిగా
సర్వరోగనివారునిగా సకలగ్రహదోషనివృత్తుడుగా
నాగదోషములు తొలగిస్తూ నరులను స్వామిదీవించు
భువిపై నిత్యము పూజలనే అందుకొనుచుండె షణ్ముఖుడు || సుజనులారా ||
రాసిన కవి రాయంచకును శ్రీమాతా నిర్మాతలకు
గానం చేసిన అఖిలకును శుభములిచ్చునా షణ్ముఖుడు
ఈ చాలీసావిను శ్రోతలకు సకలభక్తజనావళికి
ఆయురారోగ్య ఐశ్వర్యాలు యిచ్చునుగాక సుబ్రహ్మణ్యుడు
ఓం శాంతి శాంతి శాంతి:

Enjoy and stay connected with us!!

Subcribe For More Devotional Songs

►My Bhakti Tv Telugu Devotional Songs : https://goo.gl/48o9zN

►My Bhakti Tv Tamil Devotional Songs : https://goo.gl/Ct1CcI

►My Bhakti Tv Oriya Devotional Songs : https://goo.gl/jUC98l

Comment