( ) సంక్షేమం అభివృద్ధిలో ప్రభుత్వానికి
... ప్రభుత్వ ఉద్యోగులు వారదులుగా ఉంటూ పనిచేయడమే కాకుండా ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో టీ.జీ.ఓ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ....ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 4నాలుగు డి.ఏ లు , బిల్లులను యుద్ధ ప్రతిపాదికన క్లియర్ చేయాలని,సి.పి.ఎస్ రద్దు, పి.ఆర్.సి ఖరారు,జీ.ఓ 317, హెల్త్ కార్డు జారీ ప్రక్రియను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు గడువు కోరిందని అప్పటివరకు వేచి చేసి అనంతరం ఉద్యోగులు ఐక్యంగా ప్రభుత్వంపై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యమాల రూపకల్పన ఉద్యోగులకు సేవలు చేసే విషయంలో టీజీవో పాత్ర ఎనలేనిదన్నారు.
అనంతరం టి.జి.ఓ డైరీ ని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో టీజీవో సంఘాల నేతలు హరికొట్ల రవి, రఫీ, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బైట్: శ్రీనివాస్ రావు... టి.జీ.ఓ.ఏ రాష్ట్ర అధ్యక్షుడు.