ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం(FM-103.2 Mhtz) 09/09/1990 రోజు ప్రారంభమయింది. ఈ కేంద్రంను Local Radio Station(LRS) గా పరిగణిస్తారు. ఇక్కడి స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా , శ్రోతల అభిరుచుల మేరకు కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది. ఈ ఆకాశవాణి కేంద్రం ద్వారా చేసే ప్రసారాలు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలే కాకుండా కొంత నిర్మల్ జిల్లా లో , జగిత్యాల జిల్లా మరియు నాందేడ్ జిల్లా వరకు కూడా ఈ ప్రసారాల పరిధి ఉంది. నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రస్తుత కాలంలో నూతన సాంకేతికత ను సంతరించుకుని 10 కిలోవాట్ డిజిటల్ transmitter తో స్పష్టత తో కూడిన ప్రసారాలను కొనసాగిస్తుంది , ఇంకా నేటి చరవాణి యుగానికి అనుగుణంగా Newsonair - Mobile app ద్వారా శ్రోతలు ఎక్కడనుండైనా ప్రసారాలను వినే విధంగా ప్రసారాలను కొనసాగిస్తుంది