vengala Hemanth oggu kathalu
శ్రీ శివ మల్లికార్జున ఒగ్గు డోలు కళ బృందం తాడికల్ 6301614082 7842705322
మా ఒగ్గు కథ ను ఆదరించండి కల ను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి భూమేష్ నాని ఒగ్గు కథ చానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్
ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’, ‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే.
బండారు (పసుపు) తో గంట , పట్న్హం వేసాక ఒగ్గుకలకారులు ఒగ్గుకథ చెప్పుతూ దేవునికి జోల పాడుతారు, తర్వాత ప్రసాదం సమర్పించే సమయానికి దేవునికి మేలుకోలేపే డానికి ఈ గంటని వాడుతారు.రాగ బావ యుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం కథాగానం అని వ్వవహరించ వచ్చు. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రధాన కథకులు,