Geetha's Katha Prapancham
అందరికీ నమస్కారం.నేను మీ గీతావాణి వేమారెడ్డి. కళలంటే,చదువంటే ఆసక్తిఉన్న కుటుంబంలో పుట్టాను. చదివిన కథల్నీ,చూసిన సినిమాల్నీ-ఆసక్తికరంగా చెప్పే అలవాటు -చిన్నప్పటినుండీ ఉంది....సత్యం శంకరమంచిగారి తరహాలో.అమ్మ,తమ్ముడు నా మొట్టమొదటి శ్రోతలు.
చదువులోB.A;M.A-ఇంగ్లీష్ Mainగా privateగా చదివినా-స్కూల్లో,ఇంటర్మీడియట్లో
నాకు పట్టుబడిన తెలుగు,ఇంగ్లీష్,కొద్దిగా హిందీ-
అవి మాత్రమే-ఇప్పటికీ గట్టిగా నాటుకుని ఉన్నవి
-అన్నది నా ప్రగాఢ విశ్వాసం!
ఈ ఛానెల్ - గాఢంగా అభిమానించే ఒక చిన్ననాటి స్నేహితురాలి ప్రేరణతో ఆరంభమైంది.
నేను ఈ audio book ప్రక్రియకు శ్రీకారం చుట్టటం-
ఆగష్టు-22....2021న జరిగింది.మొట్టమొదటి ఆడియోబుక్-శరత్-'సరయు'...29 ఆగష్టున Publicలోకి రిలీజ్ అయింది.
ఆదరణవున్నా,లేకపోయినా-కనీసం నేనైనా-నా ఈ ప్రయత్నానికి -నేనే సంబరపడుతూ-అనివార్యమైన చివరిరోజులు గడిపెయ్యచ్చుకదా -అనే ఆకాంక్షతో ఈపనిని కొనసాగిస్తున్నాను;