ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి SHOAP-TV స్వాగతం పలుకుతోంది. భారతదేశం, అనేక భాషలు, మతాలు, జాతులు, తెగలతో, సంస్కృతి, సాంప్రదాయాలతో ఎన్నో విశిష్టమైన ప్రత్యేకతలను కలిగివుంది. నేడు సమాచార రంగంలో ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలే కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో స్ధానిక భాషల్లో సరళీకృత సమాచార అవసరం వుంది. ఇలాంటి పరిస్ధితులలో YouTube వంటి సోషల్ మీడియా ప్రపంచంలో గల అన్ని భాషలల్లోను సమాచారాన్ని యథాతథంగా ప్రజలకు చేర వేసే సదుపాయం కల్పించడం ఎంతో హర్షనీయం. ఇలా ప్రపంచంలోని భాషలన్నింటికి జీవం పోస్తూ విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పిస్తున్న YouTube సోషల్ మీడియాకు అభినందనలు తెలుపుకుంటూ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారికి విద్య, వైద్య, శాస్త్ర , సాంకేతిక, పారిశ్రామిక,, వ్యవసాయ, రాజకీయ, సాంఘీక, సాంస్కృతిక, కళారంగాల వంటి అన్ని రంగాలలో సమాచారాన్ని ఎంతో కొంత ఎప్పటికప్పుడు కమ్మనైన, అమ్మలాంటి తెలుగు భాషలో అందించాలన్నదే SHOAP-TV లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆశీస్సులను మన ఈ SHOAP-TV ద్వారా అర్థిస్తున్నాను. ఆ కాంక్షిస్తున్నాను. - డాక్టర్ టి.సేవకుమార్.