Sakala Devatala Sankeertanalu
సకలదేవతలు కీర్తనలు, అలవోకగా, సరళమైన పదాలతో, రాగాలతో, భగవంతుని అనుగ్రహంతో, వ్రాయడం,స్వరపరచడం, గత పది సంవత్సరాలుగా చేస్తున్నాను. భక్తి నీరాజనం పేరుతో రెండు పుస్తకాలను ప్రచురించాను. భక్తి నీరాజనం పేరుతో భద్రాచలం, వేములవాడ, పెంచలకోన, యాదగిరిగుట్ట, శ్రీశైలం లలో, భక్తబృందంతో, కీర్తనలు గానం చేసాము. గత ఆరు నెలలుగా, స్థానిక, శివానంద ఆశ్రమంలో భక్తులు నేర్చుకుంటున్నారు. 108మందితో, శ్రీ రామ, శ్రీ కృష్ణ అష్టోత్తర శత గళ సంకీర్తన నీరాజనం ఉత్సవములు చేసాము.
భక్తులు అందరూ నేర్చుకోవడానికి వీలుగా YouTubeసౌకర్యం ఒక చిన్న ప్రయత్నం. ఈపరమాత్మ మనకు అందించిన, ఈ భక్తి సంకీర్తనలన్నీ ఇంకా ఎక్కువ మంది నేర్చుకోని తరించాలన్నది ముఖ్యోద్దేశం.
అందరూSubscribe చేసి, నేర్చుకొని, వెయ్యి మందితో సామూహికంగా భగవంతుని విశ్వ శాంతికై , సంకీర్తన చేయాలన్నదే,ఈ క్షణం లో కల్గిన సత్సంకల్పం.
Subscribe చేసిన వారందరికీ నమస్కారములు, ధన్యవాదాలు.🙏👏
రాజేశ్వరి సుభ్రహ్మణ్యం