MENU

Fun & Interesting

Alanaati Kathalu Evergreen Stories

Alanaati Kathalu Evergreen Stories

తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి తాడేపల్లి. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. బాలమిత్ర, చందమామ కథలన్నీ కూడా చిన్నతనం నుంచే చదవడం మొదలుపెట్టాను. నిజంగా నాకు పుస్తకాలే స్నేహితులు. ఎక్కడికైనా యాత్రా స్థలాల కు వెళ్లిన, ఏ ప్రదేశాలకు వెళ్ళినా నేను పుస్తకాలు కొంటూ ఉంటాను. నా షాపింగ్ అంటే పుస్తకాల మీదే ఉంటుంది. ఇప్పటి కాలం పిల్లలు చదవడం చాలా తగ్గిపోయింది. అందులోనూ తెలుగు చదవడం అనేది చాలా తగ్గిపోయింది. అందుకే ఈ అలనాటి కథలు అనే ఛానల్ ప్రారంభించి కథలు చదివి వినిపించాలని నా చిన్ని ప్రయత్నం.
మన చానల్లో మాదిరెడ్డి సులోచన గారి నవలలు, యద్దనపూడి సులోచన రాణి గారి నవలలు, పోల్కంపల్లి శాంతాదేవి గారి నవలలు, మాలతి చందూర్, ద్వివేదుల విశాలాక్షి అందరి నవలలు ఇంకా మంచి మంచి కథలు అన్నీ కూడా మన ఛానల్లో మీరు వినవచ్చు.
మీరందరూ తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని, మన చానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకుని అందరికీ మన వీడియోస్ ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ 🙏

sreedevigiridhar3@gmail.com

youtube.com/@alanaatiKataluevergreenstories