MENU

Fun & Interesting

Vegetarian Tv

Vegetarian Tv

ప్రపంచ మానవాళి అంతా శాకాహారులుగా మారాలన్న మహా సంకల్పంతో ప్రారంభమైంది ఈ VEGETARIANS TV. నాగరికులమని చెప్పుకుంటున్న మనం ఇంకా కడుపు నింపుకోవడం కోసం ప్రతి రోజూ కొన్ని కోట్ల మూగ జీవాలను నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నాం...ఈ జీవ హత్యాకాండను అందరికీ గుర్తు చేస్తూ శుద్ధ శాకాహారులుగా మార్చడానికి వివిధ మార్గాలలో కృషి చేస్తుంది మన VEGETARIANS TV. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది, జంతు జాతి మనకు ఆహారం కాదని తెలుసుకుని శాకాహారులుగా మారిన వారి అనుభవాలను విశేషంగా మీ ముందుకు తీసుకువస్తుంది VEGETARIANS TV.చక్కటి రుచి కరమైన శాకాహార వంటలను మరి శాకాహార పదార్ధాల లాభాలను తెలియచేస్తుంది మన VEGETARIANS TV. వృక్ష జాతి ద్వారా ప్రకృతి మనకందించిన ఎన్నో ఔషధాలను ఆయుర్వేద విజ్ఞానం ద్వారా మరి ఎంతోమంది ఆయర్వేద నిపుణుల సందేశాలను మనకు తెలియచేస్తుంది మన VEGETARIANS TV. భారతదేశం యొక్క మూల ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, సనాతన మరి సనూతన ఋషుల అనుభవ సారాన్ని ప్రపంచానికి అందించి ప్రతి మనిషిలోనూ నిగూఢంగా ఉన్న ఆత్మ జ్ఞానాన్ని తట్టి లేపుతుంది మన VEGETARIANS TV...మనం జీవిద్దాం-జీవించనిద్దాం, అహింసా పరమో ధర్మః, జీవా సమస్థా సుఖినో భవంతు.