What is Sukshma Sharira Yana? Nanotechnology | సూక్ష్మ శరీర యానం! | M Planet Leaf (MPL) Videos Exclusive...
OUR LINKS:
►SUBSCRIBE TO OUR FACTS HIVE (Channel) :- http://bit.ly/37YCsW7
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://goo.gl/ZTwU1K
►SUBSCRIBE ON TELEGRAM (Group) :- https://t.me/mplsd
ఇవాళ సైన్స్, పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది, నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే, ఈ నానో టెక్నాలజీ, కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే…. మన ఋషులు, యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే, సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే, ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి, సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా, కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ, ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు.
మహాభారతంలో, ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో, మాన సంరక్షణ కోసం ఆమె శ్రీ కృష్ణుడిని ప్రార్ధించింది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు, తక్షణం అక్కడ ప్రత్యక్షమై, ద్రౌపది శీలాన్ని కాపాడాడు. దానికి ఆయన ఎంచుకున్న ప్రయాణ సాధనం, నానో టేక్నాలజీయే. త్రిలోక సంచారి ఐన నారదుడు, నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించే వాడు. ఇదంతా సైన్సు ప్రకారం ట్రాష్ అనే అవకాశం వుంది. అందుకే, ఇక్కడ ఒక సజీవ ఉదాహరణ ఇస్తున్నాను. హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళాలు అందరికీ గుర్తున్దేవుంటాయి. అక్కడికి లక్షలాది మంది నాగసాధువులు రావటం, మనం టీవీలలో, పేపర్ లలో చూశాం. నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా, ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి, కుంభమేళా జరిగే ప్రదేశాలు, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు, ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా, ఏ ఫోటోగ్రాఫర్ కయినా, ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది, ప్రత్యెక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా? లేదే… సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభ మేలా ముగిశాక, తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి, హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు? వీటన్నింటికీ సమాధానం ఒకటే. అదే సూక్ష్మ శరీర యానం. అదే నానో టెక్నాలజీ. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం. ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే, దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు, జర్మనీ వాడు చెప్పే సొల్లు అంతా విని, చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి, అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.
ఇక నాగ సాధువుల గురించీ వారి జీవన విధానం గురించీ తెలుసుకుందాం..
ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి, ముందుగా తాను, తనకు సంబంధించిన అన్ని భవబంధనాలనూ వదులుకోవలసివస్తుంది. అందుకే, కుంభమేళా జరిగే సమయంలో, అక్కడ వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు ధరించే విభూతి, నామాలు, మరియు రుద్రాక్షల ద్వారా, ఏ ఆగడాకు చెందిన వారో తెలియచేయబడుతుంది.
Nanotechnology technique was not a new phenomenon for ancient Indian society but the word nanotechnology was new for ancient Indians. In ancient India the nanotechnology technique was used in medical treatment of diseases in human beings, weapons used in wars, in steel industry, Indian crafts and in cultural rituals. Aghora concept is referred in the latest Telugu movie Akhanda. Charak Samhita is oldest Aurvedic epic in Indian Cultural Society used for treatment of diseased human beings. Concept of reduction in particle size of metals is clearly discussed in Charak Samhita Extreme Reduction of particle size of metals or nonmetals is termed as nanotechnology. From the ancient Indian time the people who are called as goldsmith skilled in preparation or manufacturing of gold or silver ornaments were used to give the Bhasma of gold or silver metals to the diseased human beings. The bhasma was prepared during the process of melting of silver and gold metal for preparation of ornaments. The bhasma was mixture of precious metals and coal powder and other minerals.
Much more is explained in Telugu in our above video. Share your thoughts in comments! And do not forget to like and share the video links...
#VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharPlanetLeaf #PlanetLeaf #MPL #Hinduism #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #సనాతనధర్మం #historical #Akhanda #అఖండ #AkhandaConcept #Aghora #Nanotechnology #Kumbhmela #mahakumbh2025 #mahakumbh