క్యాన్సర్....ఈ పేరు చెబితే చాలు ఎంతోమంది భయపడిపోతుంటారు. ప్రాణాలు పోతాయని ఆందోళన చెందుతుంటారు. ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియక కంగారు పడుతుంటారు. ఈ ఆందోళనల మధ్యే ఇటీవల కాలంలో పురుషుల్లో నోటిక్యాన్సర్‌లు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో తల, గొంతు క్యాన్సర్ బారిన పడుతున్న వారు కూడా ఒక్కసారిగా పెరిగారు. యువతలో ఈ తరహా క్యాన్సర్‌లు ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. క్యాన్సర్ల నుంచి అప్రమత్తంగా ఎలా వ్యవహరించాలో నిమ్స్ ఆంకాలజీ విభాగాధిపతి, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సదాశివం విపులంగా వివరించారు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనతో ప్రత్యేక ముఖాముఖి.
ప్రతి సంవత్సరం రకరకాల కార్యక్రమాలతో ప్రజలకు క్యాన్సర్ పై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఏడాది ఒక థీమ్‌తో ముందుకొస్తున్నారు. అలాగే ఎన్నో రకాల క్యాన్సర్లకు అధునాతన చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యుత్తమ ఔషధాలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముఖ్యమంటున్నారు వైద్యులు. ముఖ్యంగా టార్గెటెడ్ థెరపీలు ప్రస్తుతం క్యాన్సర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉండటంతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు డాక్టర్ సదాశివం...
#Idi Sangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------