MENU

Fun & Interesting

యేసునామస్మరణ చేయండి|Yesu naama smarana|Bible mission songs|Telugu christian song|Bible Mission Gooty

Bible Mission Songs 385,035 5 years ago
Video Not Working? Fix It Now

#Biblemissionsongs#Teluguchristiansongs#Telugukraisthavakeerthanalu#Andhrakraisthavakeerthanalu#Biblemissiongooty#Biblemissionjammalamadugu# Song:Yesu naama smarana cheyandi యేసునామస్మరణ చేయండి Album: Ghanaparchudi Devuni Lyrics & Composition: Shri.Mungamuri Devadas Ayyagaru Audio Track Credits:Bible Mission Gooty For more Bible mission songs SUBSCRIBE Our channel మరిన్ని బైబిలు మిషను పాటలకొరకు SUBSCRIBE చేసుకోగలరు Song lyrics: యేసునామస్మరణ చేయండి - ప్రియులారా క్రీస్తు యేసునామస్మరణ చేయండి యేసునామస్మరణవలన - ఎట్టికష్టమైన తొలగును యేసునామస్మరణవలన - ఎట్టి సౌఖ్యమైన కలుగును యేసునామస్మరణవలన - ఏదిపోదు? ఏది రాదు?|| యేసు || యేసునామ స్మరణ మానకుడి ప్రియులారా క్రీస్తుయేసు నామ స్మరణ మానకుడి యేసునామస్మరణవలన - ఎట్టిపాపమైన పోవును యేసునామ స్మరణవలన - ఎట్టివ్యాధియైన కుదురును యేసునామ స్మరణవలన - ఎట్టికొదువయైన గడచును యేసునామ స్మరణవలన ఎట్టి ఆమెకైన శిశువులు = యేసునామ స్మరణవలన - ఎట్టిభూతమైన వదలును|| యేసు || యేసుక్రీస్తు చరిత్ర వినరండి - భూజనులారా - యేసుక్రీస్తు చరిత్ర వినరండి యేసుదేవుడు నరుడు భూ - వాసియాయెను బోధించెను ధర్మముల మార్గమునందు - తానెనడచి దారిచూపెను మందులేకుండగనె జబ్బుల్ - మాన్పె మృతులకు జీవమిచ్చెను నరులలోని దయ్యములను - తరిమివేసి సౌఖ్యమిచ్చెను పాపములను గెల్చివేసెను - పాపులకాదరణయిచ్చెను ఆకలితోనున్న వారికి - అప్పములు కల్పించిపెట్టెను ఆపదయందున్న వారికి - ఆపద తప్పించివేసెను లెక్కలేకుండగను నిత్యము - లెక్కలేని మేళ్ళుచేసెను వాటినెల్లను వ్రాయబూనిన - వయసుచాలదు వసుధపట్టదు పాపపరిహారంబుకొరకు - ప్రాణ రక్తము బలిగపెట్టెను మరణమొందియు తనకుతానె - మరల బ్రతికి పరమువెళ్ళెను తిరిగివచ్చి భక్తజనులను - పరమునకు కొంచుకొనిపోవును ఇట్టిదేవుడు ఇట్టినరుడు - ఎవరును ఎక్కడను లేని|| యేసు || Maranatha to all...

Comment